The Ghost : నాగార్జున ‘ది ఘోస్ట్’ అడ్వాన్స్ టిక్కెట్ సేల్స్ మరీ అంత దారుణమా.?
NQ Staff - October 3, 2022 / 03:31 PM IST

The Ghost : అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ఘోస్ట్’ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. నాగార్జున కెరీర్‌లోనే ఏ సినిమాకీ పెట్టనంత ఖర్చు ఈ సినిమాకి పెట్టేశారు. సోనాల్ చౌహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
కింగ్ నాగ్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంచనాలకు మించి జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, ‘ది ఘోస్ట్’ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా డల్లుగా కనిపిస్తున్నాయి.
అమెరికాలో 500 టిక్కెట్లు కూడా సేల్ అయినట్లు కనిపించడంలేదు. సినిమా యూఎస్ ప్రీమియర్ రేపు రాత్రికే పడనున్న సంగతి తెలిసిందే.!
తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్సులు డల్లుగానే..
హైద్రాబాద్ సిటీలో ఒక్క థియేటర్‌కి సంబంధించి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అయినట్లు కనిపించడంలేదు. ఎఎంబీ, ప్రసాద్ వంటి ప్రముఖ మల్టీప్లెక్సుల్లోనూ టిక్కెట్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కొంత బెటర్‌గా వున్నా, ఈ తరహా పరిస్థితిని అక్కినేని నాగార్జున అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
సెలవుల సీజన్ లోనూ ఇంత డల్లుగా అడ్వాన్స్ బుకింగ్స్ వుండటానికి రీజన్ ఏంటి.? అన్నదానిపై ‘ది ఘోస్ట్’ టీమ్ తలలు పట్టుకుంటోందిట.