Anchor Suma : సుమని బంగారు తల్లివంటూ హత్తుకొని కన్నీరు పెట్టుకున్న నటి
NQ Staff - July 10, 2022 / 01:34 PM IST

Anchor Suma : ఎంత మంది కొత్త యాంకర్స్ వచ్చిన సుమకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. స్టార్ హీరోయిన్స్‌కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ సుమకి ఉంది. సుమ హోస్ట్ గా చేస్తున్న షో క్యాష్. ప్రతి వారం ఈ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది. సుమ చలాకీగా ఉంటూ.. సందర్భానుసారంగా వేసే కామెడీ పంచ్ లు అలరిస్తూ ఉంటాయి.

actress interesting comments on Anchor Suma
సుమ గొప్ప మనసు..
సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకుంటూ దూసుకుపోతోన్న షోలలో ‘క్యాష్’ ఒకటి. తెలుగు టాప్ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తోన్న ఈ షోకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఇందులో ఆమె చేసే సందడే అని చెప్పొచ్చు. ఎంతో కాలంగా ఎలాంటి వివాదాలు లేకుండా సాగిపోతోన్న ఈ షోకి వచ్చే సెలబ్రిటీలు కూడా తెగ సందడి చేస్తుంటారు.
తాజాగా క్యాష్ షోకి టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కృష్ణవేణి, సుభాషిణి, జెన్నీ హాజరయ్యారు. సీనియర్ ఆర్టిస్టులు అయినప్పటికి వీరి అల్లరి, సుమ ఉత్సాహంతో షో సరదాగా సాగింది. తాజాగా ఈ ప్రోమో రిలీజ్ చేశారు. సుమ వీరితో ఒక రేంజ్ లో రచ్చ చేయించింది.
మీ పెళ్లి కన్నా ముందు ఏవైనా ప్రేమ కథలు ఉన్నాయా అని సుమ జెన్నీని ప్రశ్నించింది.. దీనికి సుభాషిణి కలుగజేసుకుని పెళ్లికి ముందు ఏంటి ఇప్పుడు చాలా ఉన్నాయి అని చెప్పింది. దీనితో అందరూ నవ్వేశారు. దీనితో జెన్నీ నీ వ్యక్తిగత విషయాలు నా మీద రుద్దకు అని కౌంటర్ ఇచ్చారు. ఈ వయసులో కూడా జెన్నీ చలాకీగా ఉంటూ కష్టసాధ్యమైన ఆసనాలు వేసి చూపించారు.
ఇక చివర్లో నటి సుభాషిణి అందరిని కంటతడి పెట్టించేలా ఎమోషనల్ గా ఒక విషయాన్ని తెలిపింది. తనకి సుమ చేస్తున్న సహాయాన్ని క్యాష్ షో వేదికగా పంచుకుంది. తానూ ఈ రోజు బ్రతికి ఇలా ఉన్నానంటే అందుకు కారణం సుమ అని సుభాషిణి తెలిపింది. తనకి ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యానికి సుమ సాయం చేసింది అని సుభాషిణి పేర్కొంది. ఇప్పటికి సుమ తనకి 6 నెలలకి ఒకసారి మెడిసిన్స్ పంపిస్తూ ఉంటుంది అని సుభాషిణి పేర్కొన్నారు.
సుమ.. సుభాషిణిని ఆప్యాయంగా కౌగిలించుకొని ముద్దు కూడా ఇచ్చింది. భావోద్వేగంతో సుమ కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. మరో జన్మ అంటూ ఉంటే నీకు తల్లిగా పుట్టాలి అని సుభాషిణి అన్నారు. ఈ పూర్తి షో జూలై 16న ప్రసారం కానుంది.