Actress Amani : అమ్మ వద్దు, ఒంటరిగా ఆఫీస్‌కు రమన్నారు.. హీరోయిన్‌కు చేదు అనుభవం
NQ Staff - February 22, 2023 / 06:20 PM IST

Actress Amani : సినిమా ఇండస్ట్రీలో అత్యంత గడ్డు పరిస్థితులను తాను ఎదుర్కొన్నారంటూ సీనియర్ హీరోయిన్ ఆమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోలతో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఆమని ఈ మధ్య కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మగా అక్కగా పాత్రలు చేస్తూ అప్పుడప్పుడు బుల్లి తెరపై కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఆమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరియర్ ఆరంభంలో తాను అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగానని.. అక్కడ చాలా రకాల పరిస్థితులను చూశాను అంటూ చెప్పుకొచ్చింది. నేను సినిమా అవకాశాల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరిగేటప్పుడు నాతో పాటు అమ్మ కూడా వెంట ఉండేవారు.
కొన్ని సినిమా ఆఫీసులకు వెళ్లిన సమయంలో ఒంటరిగా రమ్మనే వారు, అమ్మ లేకుండా వస్తే అన్ని విధాలుగా మాట్లాడు కోవచ్చు అంటూ ఇబ్బందికరంగా చూస్తూ మాట్లాడేవారు. అప్పుడే నన్ను సినిమాల వైపు నాన్న ఎందుకు వెళ్లొద్దన్నారో అర్థమైంది.
కెరీర్ ఆరంభంలో కొందరు ఫిల్మ్ మేకర్స్ హీరోకు చెల్లి పాత్రలో లేదంటే కూతురు పాత్రల్లో చేయమని అడిగారు.. అలా చేస్తే కెరీర్ మొత్తం అలాంటి పాత్రలే చేయాల్సి వస్తుందని ఉద్దేశంతో.. నేను ఖాళీగా అయినా ఉంటాను కానీ అలాంటి పాత్రలు చేయను అని తేల్చి చెప్పాను. ఎన్నో ఇబ్బందులు ఎదురు అయినా కూడా కష్టపడి ప్రయత్నాలు చేసిన తనకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించిందని ఆమని పేర్కొంది.