Actor Suman : ఆదిపురుష్ అస్సలు బాలేదు.. హీరో సుమన్ సంచలన కామెంట్లు..!
NQ Staff - June 22, 2023 / 11:21 AM IST

Actor Suman : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ మూవీ మొన్న థియేటర్లలోకి వచ్చింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా.. కృతిసనన్ సీతగా యాక్ట్ చేసింది. ఇందులో రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దీన్ని తెరకెక్కించాడు.
అయితే ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఈ మూవీపై విమర్శలు కూడా ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. రాముడి లుక్, కొన్ని సీన్లపై దారుణంగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా ఈసినిమాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా హీరో సుమన్ కూడా స్పందించారు.
సీనియర్ హీరో సుమన్ కూడా ఆదిపురుష్ సినిమాను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా అంతగా బాలేదు. ఈ సినిమా కోసం ప్రభాస్ రెండేండ్లు కష్టపడ్డారు. పాత్ర కోసం ఆయన ప్రాణం పెట్టారు. అందుకు ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
కానీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను హాలీవుడ్ గ్లాడియేటర్ రేంజ్ లో తీశాడు. అదే మైనస్ అయిపోయింది. మనకు తెలిసిన రాముడు కృష్ణుడు అంటే నీలంగా కనిపిస్తారు. గడ్డాలు మీసాలు ఉండవు. కానీ ఓం రౌత్ అందుకు భిన్నంగా చూపించే ప్రయత్నం చేశారు. అది పెద్ద తప్పు చేశారు అంటూ చెప్పుకొచ్చాడు సుమన్.