ED Office: పూరీని 10 గంట‌ల పాటు విచారిస్తే, ఛార్మీకి 8 గంట‌ల పాటు ప్ర‌శ్న‌ల వ‌ర్షం

ED Office: టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అకస్మాత్తుగా దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే పూరీ జగన్నాథ్‌ను మంగ‌ళ‌వారం విచారించ‌గా, ఆయ‌నను ప‌లు అంశాల‌పై దాదాపు ప‌ది గంట‌ల పాటు విచారించిన‌ట్టు తెలుస్తుంది. ఇక సెప్టెంబ‌ర్ 2న ఛార్మీ ఈడీ ముందుకు హాజ‌రు కాగా, ఆమెను ఈడీ అనేక విష‌యాల‌పై ప్ర‌శ్న‌లు సంధించింది.


Actor Charmee Kaur grilled for 8 hours and Director Puri Jagannadh Questioned For 10 Hours by ED
Actor Charmee Kaur grilled for 8 hours and Director Puri Jagannadh Questioned For 10 Hours by ED


ఉదయం మొదలైన విచారణ ఏకధాటిగా కొనసాగింది.దాదాపు 8 గంట‌ల పాటు సాగిన విచార‌ణ‌లో ఈడీ అధికారులు అకౌంట్స్ వివ‌రాలు అడ‌గ‌గా, ఆ అకౌంట్ల వివరాలు ఇచ్చానని ఛార్మీ చెప్పారు. కెల్విన్ ఎవరో తనకు తెలియదని ఆమె ఈడీ అధికారులకు తెలిపారు. విచారణ ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు కీలక డాక్యుమెంట్లు అందజేసినట్లు ఛార్మీ చెప్పారు. విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అన్ని విధాలా సహకరిస్తానని ఆమె తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన అకౌంట్ల వివరాలు ఇచ్చానని ఛార్మీ చెప్పారు.


ఎక్సైజ్‌ విభాగానికి చెందిన సిట్‌ దాఖలు చేసిన చార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. దీనిపై విచారణకు హాజరు కావాలని పూరీ జగన్నాథ్‌, చార్మీ కౌర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా దగ్గుబాటి, రవితేజతోపాటు డ్రైవర్‌ శ్రీనివాస్‌, నవ్‌దీప్, ఎఫ్‌–క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌, ముమైత్‌ ఖాన్‌, తనీష్‌, నందు, తరుణ్‌లకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే!


ఈడీ అధికారులు. 2016లో కెల్విన్‌తో మాట్లాడిన కాల్ డేటా.. వాట్సాప్ ఛాట్‌ను ఛార్మీకి చూపిన అధికారులు దాదా పేరుతో ట్రాన్స్‌ఫర్ అయిన లక్షల రూపాయల లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే కెల్విన్ ఎవరో తనకు తెలియదని ఛార్మీ ఈడీ అధికారులకు చెప్పారు. కెల్విన్‌తో పాటు మరో ముగ్గురి ఫోటోలను ఛార్మీకి చూపిన అధికారులు వారితో జరిగిన లావాదేవీలపై ఆమెను ప్రశ్నించారు.


పూరి జగన్నాథ్‌ – ఆగస్టు 31, ఛార్మి – సెప్టెంబర్‌ 2, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ – సెప్టెంబర్‌ 6, రానా దగ్గుబాటి – సెప్టెంబర్‌ 8, రవితేజ – సెప్టెంబర్‌ 9, శ్రీనివాస్‌ – సెప్టెంబర్‌ 9, నవదీప్‌ – సెప్టెంబర్‌ 13, ఎఫ్‌ క్లబ్‌ జనరల్ మేనేజర్ – సెప్టెంబర్‌ 13, ముమైత్‌ ఖాన్‌ – సెప్టెంబర్‌ 15, తనీష్‌ – సెప్టెంబర్‌ 17, నందు – సెప్టెంబర్‌ 20, తరుణ్‌ – సెప్టెంబర్‌ 22న విచారణకు హాజరు కానున్నారు. ఈ లిస్ట్‌లో పూరీ, ఛార్మి విచార‌ణ పూర్తి కాగా త్వ‌ర‌లో ర‌కుల్‌ని విచారించ‌నున్నారు.