Actor Brahmaji Sensational Comments In Slum Dog Husband Press meet : కుక్కతో ఫస్ట్ నైట్ బాగుంది.. మీరు కూడా ట్రై చేయండి.. బ్రహ్మాజీ దిక్కుమాలిన కామెంట్లు..!

NQ Staff - July 11, 2023 / 09:56 AM IST

Actor Brahmaji Sensational Comments In Slum Dog Husband Press meet  : కుక్కతో ఫస్ట్ నైట్ బాగుంది.. మీరు కూడా ట్రై చేయండి.. బ్రహ్మాజీ దిక్కుమాలిన కామెంట్లు..!

Actor Brahmaji Sensational Comments In Slum Dog Husband Press meet  :

నటుడు బ్రహ్మాజీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. చాలా సినిమాల్లో హీరోగా చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఇక ఆయన ఓ పెండ్లి అయి కొడుకు ఉన్న అమ్మాయిన ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. తన భార్యకు మొదటి భర్త ద్వారా కలిగిన కొడుకును తన కొడుకులా చూసుకుంటున్నాడు.

అతని కోసం మళ్లీ పిల్లల్ని కూడా కనలేదు బ్రహ్మాజీ. అయితే ఇప్పుడు ఆయన కొడుకు సంజయ్ రావును హీరోగా పెట్టి ఇప్పటికే పిట్ట కథ అనే సినిమా తీశారు. ఇప్పుడు స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమాను కూడా తీస్తున్నారు. ఇందులో ప్రణవి మానుకొండ హీరోయిన్ గా చేస్తుంది. డైరెక్టర్ ఈ మూవీని వెరైటీ కాన్సెప్టుతో తెరకెక్కించాడని అర్థం అవుతోంది.

తాజా ప్రెస్ మీట్ లో..

ఇక తాజాగా హైదరాబాద్ లో ఈ మూవీ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో బ్రహ్మాజీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేశాడు. బ్రహ్మాజీ ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే. ఇక తాజాగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్ట్ సురేష్‌ కొండేటి గారు అందరినీ కాంట్రవర్సీ ప్రశ్న అడుగుతాడు. ఈ సారి కుక్కతో పెళ్లి చేశారు.. మరి ఫస్ట్ నైట్ కూడా చేశారా అని అడుగుతాడేమో అని బ్రహ్మాజీ అన్నాడు.

వెంటనే సురేష్‌ కొండేటి మాట్లాడుతూ.. మరి ప్రశ్న చెప్పినప్పుడు ఆన్సర్ కూడా ఇవ్వవా అని అడిగాడు. బ్రహ్మాజీ స్పందిస్తూ.. కుక్కతో ఫస్ట్ నైట్ చాలా బాగుంది కావాలంటే మీరు కూడా ట్రై చేయండి అంటూ సెటైర్లు వేశాడు. దాంతో అందరూ నవ్వేశారు. కానీ కొందరు మాత్రం ఇవేం దిక్కుమాలిన కామెంట్లు అంటూ బ్రహ్మాజీని ఏకి పారేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us