Getup Sreenu : కాజల్‌కే కాదు గెటప్ శ్రీనుకి కూడా ఝలక్ ఇచ్చిన ఆచార్య టీం
NQ Staff - May 1, 2022 / 04:12 PM IST

Getup Sreenu : చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం ఆచార్య. ఈ సినిమా తొలి షో నుండి నెగెటివ్ టాక్ తెచ్చుకున్నవిషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటించింది. చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె పాత్ర సంతృప్తికరంగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చారు.
ఇదే విషయాన్ని కాజల్ కు చెప్పగా… ఆమె చిరునవ్వుతో సంతోషంగా పక్కకు తప్పుకుందని ఆయన అన్నారు. అయితే, చిత్రం నుంచి ఆమె తొలి షెడ్యూల్ తర్వాత తప్పుకున్నప్పటికీ… అప్పటికే తన రెమ్యునరేషన్ ను తీసేసుకుందట. దాదాపు కోటిన్నర రూపాయలను ఆమె తీసుకుందని చెపుతున్నారు. తనకు రావాల్సిన డబ్బు వచ్చినందున… సినిమా నుంచి పక్కన పెట్టినా ఆమె సైలెంట్ గా ఉందని అంటున్నారు.

Acharya Team Edited comedy Scenes Getup Sreenu
ఇప్పుడు ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను విషయంలో ఇదే జరిగింది. జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరు గెటప్ శ్రీను కు ఇలాంటి అనుభవమే ఎదురయిందని వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఆచార్య సినిమా కోసం గెటప్ శ్రీను కాస్త ఎక్కువ రోజులే పని చేసాడని తెలుస్తోంది. మాంచి కామెడీ ట్రాక్ రన్ చేసారు. కానీ మరి ఏమయిందో ఫైనల్ ఎడిట్ లో ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ లేచి పోయిందని సమాచారం.
బహుశా కాజల్ కాంబినేషన్ కామెడీ సీన్లు ఉండొచ్చేమోనని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు. లేదా సీరియస్ సినిమాలో ఫన్ ప్రొపర్ గా మిక్స్ కాకపోవడం లేదన్న డౌట్‌తో అయిన ఆ ఎంటర్ టైన్ మెంట్‌ను లేపేసి ఉంటారని అనుకుంటున్నారు. మొత్తానికి సీన్లు లేపేసారని టాక్ వినిపిస్తోంది.
పాపం గెటప్ శ్రీనుకు మెగాస్టార్ అంటే ఎంతో అభిమానం. అలాంటిది చిరు సినిమాలో అవకాశం రాగానే.. శ్రీను ఎగిరి గంతేసి ఉంటాడు. అలాంటిది ఇప్పుడు… మెగాస్టార్ సినిమాలో తన క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్స్ తీసేసారని తెలిస్తే ఆ బాధ వర్ణించలేం.