Vivek Agnihotri : ‘పుష్ప’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ-2’ కాంబోలో సినిమా.!

NQ Staff - November 4, 2022 / 07:05 PM IST

Vivek Agnihotri : ‘పుష్ప’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ-2’ కాంబోలో సినిమా.!

Vivek Agnihotri : ఆ ముగ్గురూ కలిశారు. కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ‘సినిమాతో అంతా ఒక్కటి కాబోతున్నాం.. వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. మీరు ఏమైనా గెస్ చేస్తారా.?’ అంటూ అందులో ఒకాయన, ప్రేక్షకులకు పెద్ద పరీక్షే పెట్టారు.

ఒకరేమో ‘పుష్ప ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన దర్శకుడు. ఇంకొకరేమో ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఫిలిం మేకర్. మరొకాయన ‘కార్తికేయ-2’ సినిమాతో జాతీయ స్థాయిలో దుమ్ము రేపిన నిర్మాత.

ఎందుకు కలిశారబ్బా ఈ త్రిమూర్తులు.?

‘కార్తికేయ-2’ నిర్మాత అభిషేక్ అగర్వాల్, ‘పుష్ప ది రైజ్’ దర్శకుడు సుకుమార్, ‘ది కశ్మీర్ ఫైల్స్’ వివేక్ అగ్నిహోత్రి.. ఈ ముగ్గురూ కలిశారు.. ఆ కలయికకు సంబంధించిన ఫొటోని వివేక్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి పై విధంగా గెస్ చెయ్యమంటున్నారు.

ఇంతకీ, ఈ ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు.? ఆ సినిమా ఎలా వుండబోతోంది.? నటీనటులెవరు.? దర్శకుడెవరు.? నిర్మాత ఎవరు.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్. సమాధానాలు దొరకాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us