Aata Sandeep : నా భార్య దగ్గరుండి వేరే అమ్మాయితో లిప్ లాక్ పెట్టించింది.. ఆట సందీప్ కామెంట్లు..!
NQ Staff - June 8, 2023 / 12:08 PM IST

Aata Sandeep : సోషల్ మీడియాను ఫాలో అయ్యవారికి ఆట సందీప్ దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రొఫెషనల్ గా డ్యాన్స్ మాస్టర్ అయిన సందీప్.. గతంలో జ్యోతిరాజ్ ను పెండ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరిద్దరూ కలిసి చేసే డ్యాన్స్ వీడియోలు బాగా పాపులర్ అవుతుంటాయి.
అయితే తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన మూవీ లవ్యూ టూ.. పెళ్లి అయిన మగాడు మరో అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తీశారు. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ మాట్లాడుడూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. నా భార్య జ్యోతిరాజ్ నాకు చాలా సపోర్ట్ చేసింది.
మూవీలోని ఓ సీన్ లో వేరే అమ్మాయితో దగ్గరుండి మరీ నాతో లిప్ లాక్ లు పెట్టించింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వెంటనే జ్యతిరాజ్ మైక్ అందుకుంటూ.. ఆ అమ్మాయి ఆస్పత్రిలో ఉన్నప్పుడు ముద్దు పెట్టాల్సి ఉంటుందని డైరెక్టర్ చెప్పాడు. దాంతో మా ఆయన వెంటనే ముద్దులు ఇచ్చాడు.
అది చాలా ఎమోషనల్ మూమెంట్ అని చెప్పుకొచ్చింది జ్యోతిరాజ్. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పెళ్లి అయిన భర్త మరో అమ్మాయిని ప్రేమించవచ్చా అని అడిగింది. దానికి సందీప్ సమాధానం ఇస్తూ.. వై నాట్ ఎందుకు ప్రేమించకూడదు. కచ్చితంగా ప్రేమించుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు అంటూ చెప్పగా.. జ్యోతిరాజ్ తల పట్టుకుంది.