Bigg Boss Season 6 : ఆదిరెడ్డి అదరహో.! విన్నర్ అయ్యేందుకు ఛాన్సులు పెరిగాయ్.!
NQ Staff - December 14, 2022 / 10:33 AM IST

Bigg Boss Season 6 : బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. చివరి వారం ఫైనల్స్‌లో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్లకు సంబంధించి ఇంట్రెస్టింగ్ ‘వీడియో పుటేజ్’ విడుదల చేస్తున్నాడు బిగ్ బాస్. అది కంటెస్టెంట్లతోపాటు, వీక్షకులకూ చూపించడం అనేది ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే.
తాజా ఎపిసోడ్లో ఆదిరెడ్డికి సంబంధించిన వ్యవహారం. ఆదిరెడ్డి గొప్పతనాన్ని బిగ్ బాస్ అభివర్ణించిన తీరు, హౌస్‌లో ఆదిరెడ్డి జర్నీకి సంబంధించి వీడియో ప్రోమో.. ఇవన్నీ వేరే లెవల్లో వున్నాయ్.
టాప్‌లో ఆదిరెడ్డి..
ఆదిరెడ్డికి తిరుగులేదంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు. ‘ఉడాల్ మామా.. కప్పు కొట్టాలి మావా..’ అంటూ ఆయన్ని ఉత్సాహపరుస్తున్నారు.
బిగ్ బాస్ రివ్యూయర్‌గా ఆదిరెడ్డి, బిగ్ బాస్ వీక్షకులకు సుపరిచితుడే. కామన్ మ్యాన్‌గా ఆయన హౌస్‌లోకి అడుగు పెట్టాడు. ఫైనల్ స్థాయికి ఇంత వరకు కామన్ మ్యాన్ అన్న కేటగిరీలో ఎవరూ చేరుకోలేదు.. ఆదిరెడ్డి తప్ప.
సో, కప్పు గెలిచేందుకు కూడా ఆదిరెడ్డికి అవకాశాలు మెండుగా వున్నాయన్నమాట. కాగా, రేసులో శ్రీహాన్, రేవంత్ నుంచి ఆదిరెడ్డికి గట్టి పోటీ వుంది.