Oscar : ఇదేం వింత.! ఆస్కార్ రేసులో ‘ఆస్కార్’ గెలిచిన సినిమా రీమేక్.!

NQ Staff - September 20, 2022 / 11:38 PM IST

Oscar : ఇదేం వింత.! ఆస్కార్ రేసులో ‘ఆస్కార్’ గెలిచిన సినిమా రీమేక్.!

Oscar : గుజరాతీ సినిమా ‘చెల్లో షో’ ఈ ఏడాది ఇండియన్ సినిమా నుంచి ఆస్కార్ రేసులోకి ఎంట్రీ ఇచ్చింది అధికారికంగా. ‘లాస్ట్ ఫిలిం షో’ అనే ఇంగ్లీషు టైటిల్‌తో ఈ సినిమాని ఆస్కార్ రేసులోకి పంపుతున్నారు. అయితే, ఈ సినిమా విషయమై పెద్దయెత్తున దుమారం చెలరేగుతోంది.

A remake of the movie that won the Oscar in the Oscar race.

A remake of the movie that won the Oscar in the Oscar race.

కారణమేంటో తెలుసా, ‘చెల్లో షో’ సినిమా 1988లో ఆస్కార్ గెల్చుకున్న ‘సినిమా పరాడిసో’ అనే సినిమాకి రీమేక్. ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ ఏ కోణంలో ఈ ‘చెల్లో షో’ సినిమాని ఆస్కార్ బరిలోకి అధికారికంగా పంపినట్టు.? అన్న విస్మయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

ఆస్కార్ వేటకి రీమేక్ సినిమాని పంపొచ్చా.?

చాలామందికి డౌటానుమానం వచ్చిందిప్పుడు.. ఆస్కార్ బరిలోకి భారతదేశం తరఫున ప్రతిష్టాత్మకంగా ఓ రీమేక్ సినిమాని పంపడమేంటి.? అని. నైతికత కోణంలో ఇది అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.

ఎరువు తెచ్చుకున్న సినిమాని రీమేక్ చేసి, మళ్ళీ దాన్ని ఇండియన్ సినిమా ఘనతగా ఆస్కార్ రేసులోకి పంపడం ముమ్మాటికీ తప్పే. కేవలం గుజరాతీ సినిమా కాబట్టి.. అన్న కోణంలో ఫెడరేషన్ ఈ సినిమాని ఆస్కార్‌కి పంపుతోందని అనుకోవాలా.? అలాగైతే ఎవరి మెప్పుకోసమీ తాపత్రయం.?

మొత్తమ్మీద, ఈసారి ఆస్కార్ పురస్కారాల వ్యవహారం భారతీయ సినీ పరిశ్రమలో పెద్ద ప్రకంపనకే తెరలేపినట్లుందన్నమాట. ఒక్క స్ట్రెయిట్ సినిమా కూడా ఆస్కార్‌కి వెళ్ళే అర్హత లేదా ఇండియా నుంచి.? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పేదెవరు.?

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us