Corona : 50 ఎకరాలు అమ్మి 8 కోట్లు ఖ‌ర్చు పెట్టిన క‌రోనా నుండి కాపాడలేక‌పోయారు..!

Corona : క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భంజ‌నం మ‌నం చూసాం. ఈ వైర‌స్ వ‌ల‌న పెద్ద పెద్ద వాళ్లు క‌న్నుమూసారు. చాలా మంది లెజండ‌రీ న‌టులు కూడా క‌న్నుమూసారు. కొంద‌రైతే ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టిన ఈ మ‌హ‌మ్మారి నుండి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయారు. తాజాగా 50 ఎకరాలను అమ్మేశారు. ఏకంగా రూ.8 కోట్లు వైద్య చికిత్స కోసం ఖర్చు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ వ్యక్తి ప్రాణం కాపాడుకోలేకయపోయారు కుటుంబసభ్యులు.

A Man spent huge amount of money for corona treatment
A Man spent huge amount of money for corona treatment

మౌగంజ్ తాలుకా ర‌క్రి గ్రామానికి చెందిన ధ‌ర‌మ్‌జై సింగ్‌ అనే రైతు గతేడాది మే 2న క‌రోనా బారిపడగా.. చికిత్స కోసం రెవాలో ఉన్న సంజ‌య్ గాంధీ ఆసుప‌త్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స కొనసాగుతుండగా ఆయ‌న ప‌రిస్థితి విష‌మించింది. దీంతో మెరుగైన వైద్యం కోసం మే 18న చెన్నైలోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అప్ప‌టికే ఆయ‌న ఊపిరితిత్తులు 100 శాతం దెబ్బతినడంతో సింగ్‌కు ఎక్మోపై ఉంచి చికిత్స కొనసాగించారు. దేశంలోనే ప్రముఖ వైద్యులు ఆయనకు చికిత్స చేయగా… లండ‌న్ నుంచి ప్ర‌త్యేకంగా డాక్ట‌ర్‌ను పిలిపించారు. అయిన‌ప్ప‌టికీ.. 8 నెల‌ల పాటు క‌రోనాతో పోరాడి చివ‌ర‌కు అపోలో ఆసుప‌త్రిలో సింగ్ క‌న్నుమూశారు. 8 నెల‌ల పాటు కృత్రిమ ప్రాణాధార వ్యవస్థ మీద‌నే సింగ్ శ్వాస తీసుకున్నాడు.

దేశంలో ఇంత సుదీర్ఘకాలం క‌రోనాకు చికిత్స తీసుకున్న తొలి వ్య‌క్తి సింగే కావ‌డం గ‌మ‌నార్హం. సింగ్ కంటే ముందు మీర‌ట్‌కు చెందిన విశ్వాస్ షైనీ 130 రోజుల పాటు కోవిడ్ చికిత్స తీసుకున్నారు. సింగ్ వైద్యం కోసం ఆయ‌న కుటుంబం త‌మ‌కున్న 50 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమిని అమ్మి రూ.8 కోట్లు ఖ‌ర్చుపెట్టింది. రోజుకు రూ.3 ల‌క్ష‌ల చొప్పున ఖర్చుచేసినా ప్రాణాలు దక్కలేదని కుటుంబ స‌భ్యులు వాపోయారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలు చేస్తూ ఆయన కూడా మహమ్మారి బారినపడ్డారని కన్నీటిపర్యంతమయ్యారు.

దేశంలో ప్రముఖ డాక్టర్లతో ధరమ్ కు చికిత్స అందించారు. అయితే ధరమ్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ బాగా వ్యాపించింది. అదే సమయంలో కిడ్నీ విఫలమైంది. మెదడులో రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమంచి చనిపోయాడు. సుమారు 8 నెలలకు పైగా చికిత్స అందించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో స్ట్రాబెర్రీ, గులాబీల సాగులో స‌రికొత్త విధానాలను అవ‌లంభించిన సింగ్.. రికార్డు స్థాయిలో దిగుబడులు సాధించారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా 2021 జనవరి 26న సత్కారం అందుకున్నారు. ఆయన క‌రోనా బారినప‌డ్డాడ‌ని తెలుసుకున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం.. ప్రభుత్వం తరఫున రూ.4 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు.