Bangarraju: బంగార్రాజు సినిమాలో 8 మంది హీరోయిన్సా.. నాగ్ ర‌చ్చ మాములుగా ఉండేలా లేదే..!

Bangarraju: అక్కినేని నాగార్జున ఇటీవ‌ల కాలంలో స‌రైన స‌క్సెస్‌లు అందుకోవ‌డం లేదు. ఆయ‌న ప్ర‌స్తుతం ఘోస్ట్ ఘోస్ట్, బంగార్రాజు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. బంగార్రాజు చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా సీక్వెల్‌గా రూపొందుతుండ‌గా, ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తైపోయింది. ప్రమోషన్ కూడా జోరుగా జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఛార్టెడ్ ఫ్లైట్‌లో తిరుగుతున్నారు నాగార్జున, చైతన్య.

8 Heroines in Nagarjuna Bangarraju Movie
8 Heroines in Nagarjuna Bangarraju Movie

జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న ఈ సినిమాపై అంద‌రిలో చాలా ఆస‌క్తి నెల‌కొంది. మూవీపై చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. బంగార్రాజు చిత్రంతో నాగార్జున మరోసారి మాయ చేయడానికి వచ్చేస్తున్నాడు. ఐదేళ్ళ కింద వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు వచ్చిన సినిమాలకు పెద్దగా టాక్ రాకపోవడం కూడా దీనికి కలిసొచ్చింది.

బంగార్రాజు సినిమాలో మరో విశేషం కూడా ఉంది. ఇందులో ఏకంగా 8 మంది హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కన్ఫ్మ్ చేసాడు. రమ్యకృష్ణ, కృతి శెట్టి మెయిన్ హీరోయిన్స్ కాగా.. మరో ఆరుగురు హీరోయిన్లు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. మీనాక్షీ దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, సీరత్ కపూర్ బంగార్రాజు సినిమాలో నటించారు.

8 Heroines in Nagarjuna Bangarraju Movie
8 Heroines in Nagarjuna Bangarraju Movie

వీరంతా సందర్భానుసారంగా వచ్చి వెళ్తుంటారు. అంటే బంగార్రాజులో గ్లామర్ పార్ట్‌కు ఏం తక్కువ లేదని అర్థమవుతుంది. ఒకేసారి 8 మంది హీరోయిన్లు అంటే చిన్న విషయం కాదు. అయితే అదంతా ప్లాన్ చేసి తీసుకోలేదని.. స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టే అంత మంది హీరోయిన్స్ సినిమాలోకి వచ్చారంటున్నాడు కళ్యాణ్. మాములుగా ఒక హీరోయిన్‌తోనే నాగ్ ర‌చ్చ మాములుగా ఉండ‌దు, మరి ఇప్పుడు అంత మంది హీరోయిన్స్ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.

ఆర్ఆర్ఆర్,రాధే శ్యామ్ చిత్రాలు వాయిదా ప‌డ‌డం ఈ సినిమాకి క‌లిసొచ్చిన అంశం. ఒక‌వేళ అవి విడుద‌లైన కూడా తాము రేసులో ఉండేవాళ్లమని.. కథపై నమ్మకం ఉందని చెప్తున్నాడు కళ్యాణ్ కృష్ణ. సినిమాలో వున్న 5 యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రధాన హైలైట్ అవుతాయని చెప్పాడాయన.