Guinness world Record : కారు ఎక్కిన అమ్మాయిలు.. గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు
NQ Staff - September 12, 2022 / 09:47 AM IST

Guinness world Record : గిన్నిస్ రికార్డ్ కి కాదేది అనర్హం.. నిజమే రికార్డు సొంతం చేసుకోవాలనే కోరిక బలంగా ఉంటే ఎవ్వరు సాధించలేని పనులు చేస్తూ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు కొందరు అమ్మాయిలు కేవలం కారులో ఎక్కి కూర్చుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ను సొంతం చేసుకున్నారు.

27 people get inside a mini cooper to create guinness world record
అయితే అమ్మాయిలు అంత సింపుల్ గా కారు ఎక్కి కూర్చోలేదు. అయిదుగురు పది మంది కారులో ఎక్కి కూర్చుంటే పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఏకంగా 27 మంది అమ్మాయిలు కారు ఎక్కి కూర్చుని రికార్డు సృష్టించారు. ఒక చిన్న కూపర్ కారులో 27 మంది కూర్చోవడంతో రికార్డు గా నమోదు అయ్యింది.
ఈ రికార్డును ఆ అమ్మాయిలు 2014 లోనే సాదించారు. కానీ తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా వారు వీడియోను తాజాగా షేర్ చేయడంతో ఇప్పుడు ఆ విషయం గురించి.. ఆ అమ్మాయిల గురించి చర్చించుకుంటున్నాం.
ఆ కారులోని సీట్లను సర్ధుబాటు చేయడంతో పాటు ఒకరిపై ఒకరు కూర్చునేలా వీలు కల్పించి మొత్తంగా 27 మంది ఎక్కేశారు. ఇప్పటి వరకు అంతకు మించి ఎక్కడ కూడా ఒకే కారులో ఎక్కలేదు. దాంతో దాదాపు పది సంవత్సరాలు కాబోతున్నా ఆ రికార్డు అలాగే ఉంది.
ఒకే కారులో అంత మందిని ఎక్కించడం ఎంత వరకు కరెక్ట్.. అయినా కారు నడపడం సాధ్యం కానంతగా కూర్చుంటే అసలు ఆ రికార్డుకు విలువ ఏం ఉంది.. అంత మంది ఎక్కినా కూడా కారు నడిపే విధంగా ఉంటే అప్పుడు రికార్డును నమోదు చేస్తే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం.
How many volunteers can squeeze into this regular-sized Mini Cooper? ? pic.twitter.com/wXf4Tihv87
— Guinness World Records (@GWR) September 5, 2022