Connect with us

Latest News

ప్రియుడి మోజులో కన్నకొడుకునే హతమార్చిన కసాయి తల్లి

Published

on

Share the News from here

ప్రస్తుత రోజుల్లో కొంతమంది తమ దగ్గరి సంబంధాలను సైతం మరిచి మృగాళ్ల తయారవుతున్నారు. కొందరైతే వాళ్ళ తాత్కాలిక సుఖాల కోసం కన్న ప్రేమలను కూడా దూరం చేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ప్రియుడి మోజులో పడి ఓ కసాయి తల్లి తన కన్న పేగు బంధాన్ని హతమార్చింది. వివరాల్లోకి వెళితే ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామానికి చెందిన ఉషా అనే మహిళా రెండు నెలలుగా భర్తతో విడిపోయి, ప్రియుడు శ్రీనుతో జీవనం సాగిస్తుంది.

ఇక ఉషాతో తన ఇద్దరు కొడుకులు కూడా ఉంటున్నారు. అయితే తన పిల్లలు, తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఒక కొడుకును పతకం ప్రకారం చంపేసింది. ఇక ఉషా, తన ప్రియుడు శ్రీనులు ఇద్దరు కలసి అభంశుభం తెలియని ఆ బాలున్ని గుట్టు చప్పుడు లేకుండా అత్య చేసి, తెలంగాణలోని కోదాడ ప్రాంతాన పూడ్చి పెట్టారు. ఇక స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు విచారణ జరుపగా.. తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీనితో నిందితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Do NOT follow this link or you will be banned from the site!