Connect with us

Latest News

తెలంగాణ మహిళా కమిషన్ కు కేసీఆర్ వ్యతిరేకమా ! కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సితక్క

Published

on

Share the News from here

తెలంగాణ ఏర్పడి ఇన్నిరోజులు అయిన తరువాత కూడా ఇంకా తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పటు చేయకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే నిన్న తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, బీజేపీ నేత గీతామూర్తి, తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్నా, టీడీపీ నాయకురాలు, సినీ నటి దివ్యవాణి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సహా పలువురు పాల్గొన్నారు.

రాష్ట్రంలో మహిళా కమిషన్ లేకపోవడం వల్లే మహిళలపై రాష్ట్రంలో అక్రమాలు పెరిగాయని, మహిళ పట్ల కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపుతో వ్యవహరిస్తుందని సమావేశంలో పాల్గొన్న నేతలు వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమలో కూడా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, అలాగే చాలామంది హీరోలు డ్రగ్స్ కూడా వాడుతున్నారని, గతంలో డ్రగ్స్ పై జరిగిన విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సితక్క మాట్లాడుతూ… మహిళలను తొక్కేయడంలో కేసీఆర్ ఎవ్వరు సాటి రారని, ఆయనకు తన కూతురు కవిత పై ఉన్న ప్రేమ తెలంగాణ మహిళలపై లేదని వ్యాఖ్యానించారు. మహిళా కమిషన్ కు ఏర్పాటు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు చెప్పాలని డిమాండ్ చేశారు.

Do NOT follow this link or you will be banned from the site!