Connect with us

Entertainment

సౌందర్య బయోపిక్ లో క్రేజి హీరోయిన్.

Published

on

Share the News from here

దివంగత నటి సౌందర్య గురించి పరిచయం అవసరం లేదు. ఒకానొకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గొప్ప పేరును సంపాదించింది. అయితే సౌందర్య బయోపిక్ చిత్రీకరించాలని మలయాళ సినీ నిర్మాతలు భావిస్తున్నారు. సౌందర్య కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది. ఇక అక్కడి నుండే ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సౌందర్య దక్షిణాది భాషల్లోని అందరు అగ్రనటులతో సినిమాల్లో నటించారు. అంతేకాదు సౌందర్య కు పెద్ద ఎత్తున ప్రేక్షక ఆదరణ ఉంది.

అయితే 2004 సంవత్సరంలో బీజేపీ పార్టీ తరుపున ప్రచారం కోసం వెళ్లిన సమయంలో హెలీకాఫ్టర్‌ ప్రమాదంలో ఆమె దారుణంగా మృతి చెందారు. అయితే ఆమె బయోపిక్ మీద సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో సౌందర్య పాత్రలో ప్రస్తుత స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటించనుందని సమాచారం వస్తుంది. అంతేకాదు ఈ బయోపిక్ లో నటించేందుకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!