Connect with us

Latest News

కాంగ్రెస్ కు ఖుష్బూ గుడ్ బై..! బీజేపీలోకి..

Published

on

Share the News from here

ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ కాంగ్రెస్ పార్టీని విడనున్నారు. ఈ మేరకు ఆమె బీజేపీ లో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే సంవత్సరంలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారానుందని సమాచారం. ఖుష్బూ గత ఆరు సంవత్సరాల నుండి ఏఐసీసీ ప్రతినిధిగా ఉన్న ఆమెను ఆ పదవి నుండి తప్పించారు.

దీనితో ఆమె కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పలికారు. ఇక ఈ నేపథ్యంలో ఆమె త్వరలో బీజేపీ లో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారు అని తెలుస్తుంది. ఒకవేళ ఖుష్బూ బీజేపీ లో చేరితే ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

Do NOT follow this link or you will be banned from the site!