Connect with us

Entertainment

తన పెళ్లి డేట్ ను ప్రకటించిన కాజల్ అగర్వాల్

Published

on

Share the News from here

టాలీవుడ్ అగ్ర నటి కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. అయితే తాను ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్ధం కూడా జరుపుకుందని, త్వరలో పెళ్ళి పీటలెక్కనుందని సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దింతో కాజల్ చేసుకోబోయే వ్యక్తి ఎవరనే విషయం మొన్నటి వరకు సస్పెన్స్ ఉండగా, తాజాగా ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా ఆమె పెళ్లి గురించి వస్తున్న వార్తలు ఎట్టకేలకు నిజం అయ్యాయి. తాజాగా కాజల్ తన పెళ్లి గురించి ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటన చేసారు.

నా పెళ్లి విషయాన్నీ పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, అయితే గౌతమ్ కిచ్లు ను అక్టోబర్ 30వ తేదీన ముంబైలో పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించింది కాజల్. ఒక చిన్న వివాహ వేదికలో తమ పెళ్లి జరగనుంది అని తెలిపింది. అలాగే ఈ వివాహానికి కేవలం దగ్గరి బంధువులు మాత్రమే హాజరు కానున్నరాని పేర్కొంది. ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో తక్కువ మందితోనే పెళ్లి చేసుకున్నానని తెలిపింది. అలాగే ఇన్నేళ్ళ నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలుస్తూ నాపై ప్రేమను చూపిస్తున్న మీ అందరికి నా నుండి ప్రత్యేక ధన్యవాదాలు అని కాజల్ వెల్లడించింది.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!