Connect with us

Latest News

జనసేన-బీజేపీ మధ్య విభేదాలు ప్రారంభమవుతున్నాయా !

Published

on

Share the News from here

ఏపీ రాజకీయాల్లో వినూత్న కలయిక ఏదైనా జరిగిందా అంటే అది బీజేపీ- జనసేన కలవడమే. మతపరమైన రాజకీయాలకు పెద్ద పీట వేసే బీజేపీతో, సిద్ధాంతాల పరంగా నడిచే పవన్ కళ్యాణ్ కలుస్తాడాని ఎవ్వరు ఊహించలేదు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం. కలవడమే కాకుండా ప్రజల సమస్యలపై కలిసి పోరాడటానికి చివరి వరకు కలిసి పని చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధినేత సోము వీర్రాజు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ విభేదాలకు రాజధాని అంశమే కారణమని తెలుస్తుంది. రాజధాని అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాలను ఏలుతుంది. ఈ రాజధాని విషయంలో బీజేపీ నాయకులు ఇంకా స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. అలాగే ఇప్పటికే రాజధాని విషయం తామేమీ చేయలేమని కేంద్రం ఆల్రెడీ ప్రకటించింది. కానీ జనసేన మాత్రం మూడు రాజధానులు వద్దని, ఒక్క రాజధాని ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెప్తుంది. అలాగే ఒక్క రాజధాని మాత్రమే ఉండాలని కోర్ట్ లో పిటిషన్ కూడా వేసింది. ఇలా పొత్తులో ఉన్న ఈ రెండు పార్టీలు రెండు వేరువేరు నిర్ణయాలకు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇలా రాజధాని విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు వస్తున్నాయని తెలుస్తుంది.

Do NOT follow this link or you will be banned from the site!