Connect with us

Entertainment

బాలీవుడ్ లో ఇస్మార్ట్ శంకర్.. హీరో ఇతగాడే..!

Published

on

Share the News from here

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి చెప్పనక్కర్లేదు. మాస్ సినిమాగా ప్రేక్షకుల్లో ఈ మూవీ మంచి పేరు సంపాదించుతుంది. ముఖ్యంగా పూరి స్టోరీ, డైలాగ్స్ తో మరోసారి తన దర్శకత్వాన్ని నిరూపించుకున్నాడు. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నిధి అగర్వాల్, నాబానటేష్ వారి అందాలతో ఆకర్షించారు. ఇక మ్యూజిక్ విషయానికి వెళ్తే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పాలి.

ఎందుకంటె ఈ మూవీలో ప్రతి సాంగ్ సూపర్ హిట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సంపాదించుకొని, బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా వసూళ్లు చేసింది. అయితే ఈ మూవీ ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కు సిద్ధం అవుతుంది. ఇక బాలీవుడ్ లో రణవీర్ సింగ్ హీరోగా నటించనున్నాడు అని తెలుస్తుంది. అలాగే హిందీలో కూడా పూరి జగన్నాథే దర్శకత్వం వహించనున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Do NOT follow this link or you will be banned from the site!