Connect with us

Entertainment

ఐపీఎల్ రెండవ మ్యాచ్ ఢిల్లీ విజయం

Published

on

Share the News from here

ఐపీల్ 2020 యూఏఈ లో అట్టహాసంగా జరుగుతుంది. అయితే నిన్న రెండవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగింది. ఇక ఈ పోటీలో ఢిల్లీ జట్టు ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్కోర్లు సమానం అయినప్పటికీ సూపర్ ఓవర్‌ లో ఢిల్లీ అద్భుతమైన విజయం సాధించింది. సూపర్ ఓవర్ ‌లో పంజాబ్ జట్టు కేవలం 2 పరుగులు మాత్రమే చేసింది. దీనితో ఢిల్లీ సులువుగా గెలిచింది.

అయితే టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇక ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. స్టాయినిస్(53), శ్రేయాస్ అయ్యర్(39) జట్టులో కీలకంగా ఆడారు. ఇక పంజాబ్ బౌలర్లలో షమీ 3 వికెట్లు తీయగా, కాట్రెల్ 2, రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీశాడు.

ఇక అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (89) పరుగులు చేసి జట్టుకు కీలక ప్లేయర్ గా నిలిచాడు. ఇక కేఎల్ రాహుల్(21), గౌతమ్(20)పరుగులు చేసారు. ఇక ఢిల్లీ బౌలర్లలో రబాడా, అశ్విన్‌, స్టాయినిస్‌లకు తలా 2 వికెట్లు తీయగా, మోహిత్ శర్మ, అక్షర్ పటేల్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇక రెండు జట్ల స్కోర్లు సమానం అయ్యాయి. దీనితో సూపర్ ఓవర్ నిర్వహించగా, పంజాబ్ జట్టు కేవలం 3 బాల్స్ మాత్రమే ఆడి 2 పరుగులు మాత్రమే చేసింది. ఇక అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 3 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ మ్యాచ్ ‌లో విజయం సాధించింది.

Do NOT follow this link or you will be banned from the site!