భ‌ర్త మ‌ర‌ణించిన 14 నెల‌ల‌కు పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన 40 ఏళ్ల మ‌హిళ‌

పుట్టిన ప్ర‌తి మ‌హిళ త‌ల్లి కావాల‌ని త‌హ‌త‌హలాడుతుండ‌డం స‌హ‌జం. మాతృత్వం అనేది జీవితంలో వారికో గొప్ప అనుభూతి. అయితే కొంద‌రు స‌మ‌స్య‌ల వ‌ల‌న పిల్ల‌ల‌కు జ‌న్మిన‌వ్వ‌లేరు.అలాంటి స‌మ‌యంలో స‌రోగ‌సి వంటి ప‌ద్ద‌తుల ద్వారా పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తున్నారు. ఇంకొందరు అయితే భ‌ర్త చ‌నిపోయిన‌ప్ప‌టికీ శుక్ర‌క‌ణాల‌ని భ‌ద్ర‌ప‌ర‌చి పిల్ల‌ల‌ను క‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 40 ఏళ్ల మ‌హిళ త‌న భ‌ర్త మ‌ర‌ణించిన 14 నెల‌ల‌కు పండంటి బిడ్డకు జ‌న్మ‌నిచ్చింది.

woman from oklahoma gives birth to baby after 14 months of husbands death
woman from oklahoma gives birth to baby after 14 months of husbands death

సారా షెలెన్ బెర్గ‌ర్ అనే మ‌హిళ భ‌ద్ర‌ప‌రచిన పిండం ద్వారా మే 3న పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అమెరికాలోని ఓక‌ల్ల‌హామాకు చెందిన ఈ ఉపాధ్యాయురాలు త‌న భ‌ర్త కోరిక మేర‌కు ఈ సాహసం చేసిన‌ట్టు చెప్పుకొచ్చింది. సారా 2018 సెప్టెంబ‌ర్‌లో స్కాట్‌ని వివాహం చేసుకుంది. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో స్కాట్ గుండెపోటుతో మ‌ర‌ణించాడు.గ‌తంలో ఆయ‌నకు గుండెపోటు రాగా, భ‌ద్ర‌ప‌ర‌చిన పిండాల ద్వారా పిల్ల‌ల్ని క‌నాల‌ని దంప‌తులు నిర్ణ‌యించుకున్నారు.

స్కాట్‌కు రెండో సారి గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూయ‌గా, ఆయ‌న మ‌ర‌ణించిన ఆర నెల‌ల‌కు బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్ స‌హాకారంతో సారా పిల్లాడిని క‌నింది. వ‌చ్చే ఏడాది చివ‌రి నాటికి మ‌రో బిడ్డ‌ను కంటాన‌ని చెబుతున్న సారా వారికి తండ్రిలోటు లేకుండా పెంచుతాన‌ని స్ప‌ష్టం చేసింది.

సారా మాట్లాడుతూ.. మేం ముగ్గురు పిల్ల‌ల‌ని క‌నాల‌ని అనుకునే వాళ్లం. శిశువు పుట్టాక నా జీవితానికి అర్ధం ల‌భించింది. మాతృ హృద‌యం సంతృప్తి చెందింది. బిడ్డ‌ను నా గుండెల‌కు హ‌త్తుకోవ‌డం వ‌ల‌న గొప్ప అనుభూతి క‌లుగుతుంది. పిల్ల‌ల‌కు తండ్రి లోటు లేకుండా పెంచుతాన‌ని స్ప‌ష్టం చేసింది సారా. త‌న చిన్నారికి గుడ్ మెడిసిన్ అని పేరు పెట్టుకుంది అమెరికా ఉపాధ్యాయురాలు.