WHO: కొత్త ర‌కం క‌రోనా.. జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ డబ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌ట‌న‌

Samsthi 2210 - July 1, 2021 / 05:03 PM IST

WHO: కొత్త ర‌కం క‌రోనా.. జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ డబ్ల్యూహెచ్‌వో ప్ర‌క‌ట‌న‌

WHO: క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో వ‌దిలేలా లేదు. రోజురోజుకు అది అనేక రూపాంతరాలు చెందుతుంది. ర‌క్తం చిందించ‌కుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తున్న ఈ మ‌హ‌మ్మారి రోజురోజుకు చాలా డేంజ‌ర‌స్‌గా మారుతుంది. వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అత్యంత ప్రమాదకరంగా మారుతుంద‌ని శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.

WHO

క‌రోనాతో ఒక‌వైపు స‌త‌మ‌తం అవుతుంటే దాని వ‌ల‌న వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్ మ‌రింత దారుణంగా మారాయి. బ్లాక్ ఫంగ‌స్ వ‌ల‌న చాలా మంది కంటి చూపు కూడా కోల్పోవ‌ల‌సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అనేక ర‌కాల వ్యాధులు ప్ర‌బ‌లుతున్న క్ర‌మంలో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కాస్త త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని అనుకుంటున్న క్ర‌మంలో థర్డ్ వేవ్ మొద‌లైంది.

డెల్టా ప్ల‌స్ వేరియంట్ మ‌న‌దేశంలోని ప‌లు జిల్లాల‌లో బుస‌లు కొడుతుంది. కొన్ని చోట్ల మ‌ళ్లీ లాక్ డౌన్‌లు పెడుతున్నారు. ఈ ప‌రిస్థితిని చూసి చాలా మంది భ‌య‌ప‌డుతుండ‌గా, ఇప్పుడు మ‌రింత భ‌య‌పెట్టేందుకు కరోనా వైరస్‌లో కొత్తగా ‘లాంబ్డా’ అనే వేరియంట్‌ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఇది అనేక దేశాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

లాంబ్బా వైర‌స్‌పై ప్ర‌తి ఒక్క‌రు దృష్టి సారించాల్సిన అవ‌సరం ఎంతైన ఉంద‌ని పేర్కొంది. బ్రిటన్‌లోని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (పీహెచ్‌ఈ) కూడా దీన్ని ‘పరిశోధనలో ఉన్న కరోనా రకం’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇది విస్తరించడం, దీని స్పైక్‌ ప్రొటీన్‌లో ఎల్‌452క్యూ, ఎఫ్‌490ఎస్‌ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్ప‌టికే బ్రిట‌న్‌లో ఆరు లాంబ్బా కేసులు బ‌య‌ట‌ప‌డ‌గా, తొలుత గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో పెరూలో క‌నిపించింది.

పెరూలో వ‌చ్చిన త‌ర్వాత లాంబ్డా వైర‌స్ చిలీ, ఈక్వెడార్‌, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్‌ నుంచి పెరూలో బయటపడిన కొవిడ్‌ కేసుల్లో ఈ వేరియంట్‌ వాటా 81 శాతం మేర ఉండటం గమనార్హం. గత 60 రోజుల్లో ఇది చిలీలో 32 శాతానికి పెరిగింది. ఈ వైర‌స్‌పై శాస్త్ర‌వేత్త‌లు అనేక ప‌రీక్ష‌లు జ‌రుపుతున్నారు. స్పైక్‌లో ఉన్న ప్రోటీన్ వ‌ల‌న ఇది ఎక్కువ‌గా వ్యాపించే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు. దీనిపై విస్తృత స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us