Antarctica: ఆ ఊరిలో ఉండాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఒక పార్ట్ తొల‌గించుకోక త‌ప్ప‌ద‌ట‌..!

Antarctica: ప్ర‌పంచంలో ఎవ‌రు ఎక్క‌డైన నివ‌సించ‌వ‌చ్చ‌నే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. కాని కొన్ని క‌ట్టుబాట్లు, ఆచార వ్య‌వ‌హారాలు ఉంటాయి. వాటిని ఫాలో అయితే ఎవ‌రికి ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. అయితే ఆచార వ్యవ‌హారాలు వంటివి సాధార‌ణంగా క‌ట్టుబొట్టులోనే ఉంటాయి. కాని ఓ ప్రాంతంలో ఉండాలంటే మాత్రం పార్ట్ తొల‌గించుకోవాలి.

Antarctica

మీరు చ‌దివింది నిజమే. అంటార్కిటిక్‌లోని విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ అనే పట్టణంలో నివసించాలంటే మాత్రం.. ముందుగా మీరు శరీరంలోని ఓ పార్టును తొలగించుకోవాలి. ఆ సర్జరీకి సంబంధించిన సర్టిఫికెట్‌ను వారికి చూపించాలి. ఏ పార్ట్ తొల‌గించుకోవాల‌నేదే క‌దా మీ డౌట్‌. అపెండిక్స్ స‌ర్జ‌రీ అక్క‌డ ఉండేందుకు త‌ప్ప‌క చేయించుకోవాలి.

విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ పట్టణం మొత్తం 14,970 చదరపు అడుగులు విస్తరించి ఉంది. ఇక్కడ కేవలం 150 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ ప‌ట్ట‌ణం చాలా స్త‌బ్ధంగా ఉంటుంది. ప‌ర్యాట‌కుల తాకిడి కూడా ఎక్కువ ఉండ‌దు. ప్ర‌శాంత‌తను ఇష్ట‌ప‌డే వారు అక్క‌డ నివ‌సించాలంటే శరీరంలోని ఆంత్రం లేదా అపెండిక్స్ తొలగించుకోవాలి. దీన్నే మనం 24 గంటల నొప్పి అని కూడా పిలుస్తాం.

విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ నివసించడానికి.. అపెండిక్స్ సర్జరీకి సంబంధం ఏంట‌నే సందేహానికిడాక్టర్ కరణ్ రాజ్ అనే నేషనల్ హెల్త్ సర్వీస్ వైద్యుడు ఏం చెప్పారంటే.. ఆ పట్టణంలో నివసించే పెద్దలు నుంచి పిల్లలు వరకు ప్రతి ఒక్కరూ తప్పకుండా అపెండిక్స్ తొలగించుకోవాలి. అందుకు కార‌ణం ఆ ప‌ట్ట‌ణంలో వైద్య సదుపాయాలు చాలా త‌క్కువ‌. ఈ ప్రాంతానికి సుమారు వెయ్యి కిలో మీట‌ర్ల దూరంలో ఒక్క ఆసుప‌త్రి ఉంటుంది.

ఎవరికైనా అపెండిసైటిస్ సమస్య వస్తే అక్కడి నుంచి హాస్పిటల్‌కు తరలించేసరికి చనిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్‌లో రెండు పడకల హాస్పిటల్, డెంటల్ క్లినిక్ మాత్రమే ఉన్నాయి. ఈ కార‌ణంగానే 2018 నుండి ప్ర‌జ‌లు అపెండిక్స్ త‌ప్ప‌క తొల‌గించాల‌నే నిబంధ‌న అమల్లో ఉంది. ఇక్కడ ఇంట‌ర్నెట్ అంతంత మాత్ర‌మే.కంప్యూట‌ర్స్ త‌క్కువ వాడ‌తారు. టెక్నాల‌జీ కూడా ఉండదు. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకొని ఆప‌రేష‌న్ చేయించేకోవాల‌నే నిబంధ‌న పెట్టార‌ట‌.

కోవిడ్-19తో పాటు వివిధ రకాల ఔషదాలు, వైద్య చిట్కాలను టిక్‌టాక్ ద్వారా వెల్లడించే కరణ్ రాజ్.. ఈ సారి విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ పట్టణంలోని వింత నిబంధన గురించి చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.