Child: అరుదైన వ్యాధి.. చిన్నారి రాయిలా మార‌డంతో ఆవేద‌న చెందుతున్న పేరెంట్స్

Child: పేరంట్స్ త‌మ పిల్ల‌ల‌ని కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ ఉంటారు. ఏ క‌ష్టం వ‌చ్చినా కూడా కుమిలిపోతుంటారు. జ‌లుబు, జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు పిల్ల‌లు పడే బాధ‌లు చూడ‌లేక లోప‌ల‌ లోప‌ల చాలా మ‌ద‌న‌ప‌డుతుంటారు.ఇక ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌కే వ‌స్తుంద‌ని తెలిసి చాలా టెన్ష‌న్ ప‌డుతున్నారు. అయితే చిన్న జ‌బ్బుల‌కే త‌ల్లిదండ్రులు ఇంత టెన్ష‌న్ ప‌డుతుంటే 5 నెల‌ల చిన్నార అరుదైన, చికిత్స లేని జబ్బు బారిన పడితే ఆ తల్లిదండ్రుల గుండెకోత వర్ణించడానికి మాటలు చాలావు.

Variety Disease to Child, Became a Stone1
Variety Disease to Child, Became a Stone1

యూకే హేమెల్ హెంప్‌స్టెడ్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన అలెక్స్‌, దవే దంపతుల‌కి బేబి లెక్సి రాబిన్స్ జ‌న్మించింది. ప్ర‌స్తుతం ఈ చిన్నారికి 5 నెల‌లు కాగా, ఈ చిన్నారి అరుదైన స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంది. ఈ ఏడాది జనవరి 31న జన్మించిన లెక్సీ ఐదు నెలల వరకు బాగానే ఉన్నప్పటికి.. ఆ తర్వాత లెక్సి శరీరంలో మార్పులు వ‌చ్చాయి.

పాప బొటనవేలు, కాలి బొటనవేలులో పెద్దగా చలనం లేదని గుర్తించారు లెక్సి తల్లిదండ్రులు. వెంట‌నే ఆసుప‌త్రికి వెళ్ల‌గా చిన్నారిని పరీక్షించిన వైద్యులు లెక్సి ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికన్స్ ప్రోగ్రెసివా (ఎఫ్‌ఓపీ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ జ‌బ్బు రెండు మిలియ‌న్ల‌లె ఒక‌రికి వ‌స్తుంద‌ట‌. దీని వ‌ల‌న కండరాలు, వాటిని కలిపి ఉంటే టెండాన్స్‌, లిగిమెంట్‌ స్థానంలో ఎముకలు ఏర్పడతాయని వెల్లడించారు.

అస్థిపంజ‌రం వెలుప‌ల ఎముక‌లు ఏర్ప‌డి క‌ద‌లిక‌లు లేకుండా శ‌రీరం రాయిలా మారుతుంద‌న్నారు. వీరి జీవితకాలం 40 ఏళ్లు మాత్రమే ఉంటుందని.. దానిలో కూడా సుమారు 20 ఏళ్లకు పైగా వారు మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపారు. ఏప్రిల్‌ల వైద్యులు లెక్సికి ఎక్స్‌రే తీయ‌గా అందులో చిన్నారి కాళ్ల ద‌గ్గ‌ర ఉబ్బి ఉండ‌డాన్ని గ‌మ‌నించారు.

ఎవ‌రికి రాని ప‌రిస్థితి త‌మ కూతురికి వ‌చ్చింద‌ని తెలిసి త‌ల్లిదండ్రులు చాలా మ‌ద‌న చెందారు. ఈవిష‌యాన్ని వీడియో ద్వారా తెలియ‌జేసిన పేరెంట్స్ చికిత్సకు సాయం చేయాల్సిందిగా కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేసి.. విరాళాలు సేకరిస్తున్నారు. లెక్సి టెస్ట్‌ రిపోర్టులను ప్రస్తుతం లాస్‌ ఏంజెల్స్‌ లాబ్‌కి పంపించారు.

త‌మ కూతురికి వ‌చ్చిన వ్యాధి గురించి లెక్సి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘యూకేలో ప్రసిద్ధి చెందిన టాప్‌ పిడియాట్రిషన్‌ లెక్సిని పరిశీలిస్తున్నారు. ఆయన 30 ఏళ్ల సర్వీసులో ఇంతవరకు ఇలాంటి కేసు చూడలేదని చెప్పుకొచ్చారు. మా చిన్నారి తెలివైంది కాబ‌ట్టి , రాత్రంతా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ప‌డుకుంటుంది. ఏ మాత్రం ఇబ్బంది పెట్ట‌దు. కాని ఇలా చికిత్స లేని జబ్బు సోకడం మా హృదయాలను కలిచివేస్తుంది. మేం మాత్రం మా ప్ర‌య‌త్నాన్ని , న‌మ్మ‌కాన్ని ఏ మాత్రం వ‌దులుకోము అని అన్నారు.నెటిజ‌న్స్ కూడా ఆ చిన్నారి త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ప్రార్ధిస్తున్నారు.