Kabul: కాబూల్‌లో ఉక్రెయిన్ విమానం హైజాక్.. ఇందులో నిజం ఎంత‌?

Kabul: ఆఫ్ఘనిస్తాన్‌లోతాల‌బిల‌న్ల రాజ్యం న‌డుస్తుండ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అక్కడి భారతీయుల్ని వీలైనంత త్వరగా ఇండియాకి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ గట్టిగా ప్రయత్నిస్తోంది. రోజుకు రెండు విమానాల్లో భారతీయులు ఇండియా వస్తున్నారు.ఉక్రెయిన్‌ ప్రభుత్వం కూడా ఆఫ్గనిస్తాన్‌లో ఉన్న తమ పౌరులను తరలింపు ప్రక్రియను ప్రారంభించింది.


Ukraine Plane Hijacked in Kabul
Ukraine Plane Hijacked in Kabul

ఈ క్రమంలో దుండగులు ఉక్రెయిన్ విమానాన్ని హైజాక్‌ చేసి ఇరాన్‌కు మళ్లించారు. విమానం హైజాక్‌ విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ మంగళవారం ధ్రువీకరించింది. విమానాన్ని హైజాక్‌ చేసింది ఎవరు అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. దీనిపై ఉక్రెయిన్ విదేశాంగ కార్య‌ద‌ర్శి మాట్లాడుతూ… ‘గత ఆదివారం మా విమానం కాబూల్‌ హైజాక్‌కు గురయ్యింది. మంగళవారం, విమానం ఆచరణాత్మకంగా మా నుంచి దొంగిలించబడింది.

విమానంలో ఉక్రెయిన్లకు బదులుగా గుర్తు తెలియని ప్రయాణీకులు ఉన్నారు. 83 మంది ప్రయాణికుల బృందంతో విమానం ఇరాన్‌కు వెళ్లింది. మా తదుపరి మూడు తరలింపు ప్రయత్నాలు కూడా విజయవంతం కాలేదు. ఎందుకంటే మా ప్రజలు విమానాశ్రయంలోకి ప్రవేశించలేకపోయారు” అని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్జెనీ యెనిన్ రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్‌తో పేర్కొన్నారు.

మరోవైపు ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి ఓలె నికోలింకో ఆ వార్తను ఖండించారు. విమానం హైజాక్ నిజం కాదని ప్రకటించారు. కాబుల్ వెళ్లిన యుక్రెయిన్ విమానాలన్నీ సురక్షితంగా తిరిగొచ్చాయని స్పష్టం చేశారు.ఉక్రెయిన్ ప్ర‌జ‌ల‌ను సుర‌క్షితంగా తీసుకురావ‌డంలో ప‌డుతున్న ఇబ్బందుల‌ని తమ డిప్యూటీ ఫారిన్ మినిష్టర్ చెప్పారే కానీ హైజాక్ చేశారనడం దానర్థం కాదని స్పష్టం చేశారు. దీనిపై యుక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

83 మందితో వచ్చిన మిలటరీ కార్గో విమానం ఒకటి యుక్రెయిన్ రాజధానికి చేరిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ఆదివారం కాబూల్ నుండి ఉక్రెయిన్ చేరుకుంద‌ని, అందులో ఉన్న 83 మందిలో 31 మంది యుక్రెయిన్ పౌరులు ఉన్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.