Afghanistan: విమానం నుండి ప‌డిన ముగ్గురిలో ఇద్ద‌రు అన్మ‌ద‌మ్ముల‌ట‌..!

Afghanistan: ఆఫ్ఘ‌నిస్తాన్‌పై తాలిబ‌న్స్ మెరుపు దాడి చేసి అనేక జిల్లాల‌ను ఆక్ర‌మించుకున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు తాలిబ‌న్ల రాక్ష‌స పాల‌న ఎలా ఉంటుందో చూసిన ఆఫ్ఘ‌న్స్ మ‌రోసారి వారి ప‌రిపాల‌న‌లో ఉండేందుకు జంకారు. దాంతో ఎలాగైనా దేశం వ‌దిలి వెళ్లిపోవాల‌నుకున్నారు. అందుకే విమానంలో ఖాళీ లేక‌.. దాని టైర్ల‌ను పట్టుకొని వేలాడుతూ అయినా దేశ స‌రిహ‌ద్దులు దాటితే చాల‌నుకున్నారు.

Three People Fallem From Afghanistan Flight
Three People Fallem From Afghanistan Flight

విమానం గాల్లోకి లేచిన వెంట‌నే వారు కింద ప‌డి మృత్యువాత ప‌డ్డారు. ఇటీవ‌ల అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం టైర్ల‌ను ప‌ట్టుకొని వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించి ముగ్గురు వ్య‌క్తులు కింద ప‌డి మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో షేర్ చేయ‌గా, ఇది తెగ వైర‌ల్ అయింది . ఈ ప‌రిస్థితిని చూసి ప్ర‌పంచ‌మమే ఆశ్చ‌ర్య‌పోయింది. ముగ్గురి మృతిపై చాలా మంది ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అయితే కింద ప‌డిన ముగ్గురిలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఉన్న‌ట్లు ఓ రిపోర్ట్ వెల్ల‌డించింది.

విమానం నుంచి కింద ప‌డిన ముగ్గురిలో ఇద్ద‌రు తోబుట్టువులు 17 ఏళ్ల రెజా, 16 ఏళ్ల క‌బీర్ (రిపోర్ట్‌లో పేర్లు మార్చారు) ఉన్నారు. వాళ్లు కింద ప‌డుతున్న స‌మ‌యంలో చూసిన వాళ్లు ఆ ఇద్ద‌రి వివ‌రాలు వెల్ల‌డి కావ‌డంలో సాయం చేశారు. ఈ ఇద్ద‌రిలో పెద్ద వాడైన రెజా మృత‌దేహం ఎయిర్‌పోర్ట్‌కు ద‌గ్గ‌ర‌లోని ఓ భ‌వ‌నంపైన ల‌భించింది. అత‌ని కుటుంబ స‌భ్యులు గుర్తించారు. క‌బీర్ జాడ మాత్రం ఇంకా తెలియ‌లేదు.

ఆఫ్ఘ‌నిస్థాన్ మొత్తం తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోయింద‌ని తెలియ‌గానే ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అదే స‌మ‌యంలో కెన‌డా లేదా అమెరికాలో 20 వేల మంది ఆఫ్ఘ‌న్ల‌కు ఆశ్ర‌య‌మిస్తున్న‌ట్లు వారి చెవిన ప‌డ‌డంతో వీరు ఎయిర్‌పోర్ట్‌కు ప‌రుగులు తీసారు. త‌మ గుర్తింపు కార్డ్ తీసుకొని వెళ్లారు. ప్లేస్ లేక‌పోవ‌డంతో వారు టైర్ ప‌ట్టుకొని వెళ్లి మృత్యువాత ప‌డ్డారు. ఆ కుటుంబంలో మొత్తం 8 మంది సంతానం కాగా.. ఈ ఇద్ద‌రే అంద‌రి కంటే పెద్ద వాళ్లు.