Yemen: మేఘాల‌పైన గ్రామం.. వారు వ‌ర్షాన్నే చూడ‌లేదట‌..!

Yemen: ప్ర‌పంచంలో ఎన్నో వింత‌లు, విచిత్రాలు ఉంటాయి. వాటిని చూస్తే వావ్ అన‌కుండా ఉండ‌లేము. తాజాగా మేఘాల‌పైన గ్రామం ఉంటుంద‌ని, వారికి వ‌ర్షం అనేదే తెలియ‌దని ఒక వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అయితే కాలానుగుణంగా వాతావ‌ర‌ణంలో మార్పులు స‌హ‌జం. వ‌ర్షాకాలంలో వ‌ర్షం, ఎండాకాలంలో ఎండ‌, చ‌లికాలంలో చ‌లి ఇలా ప్ర‌తి మూడు నెల‌ల‌కొక‌సారి వాతావ‌ర‌ణంలో మార్పులు జ‌రుగుతుంటాయి.

yemen

అయితే ఓ గ్రామంలో మాత్రం రోజూ ఉద‌యం ఎండ‌, రాత్రి పూట చ‌లి ఉంటుంద‌ట‌. వ‌ర్షం మాత్రం వాళ్ల ద‌గ్గ‌ర ఇప్ప‌టి వ‌ర‌కు కుర‌వ‌లేద‌ట‌. అందుకు కార‌ణం ఆ గ్రామం మేఘాల‌పైనే ఉండ‌డ‌మేన‌ట‌. అల్ హుతైబ్ అనేది యెమెన్ రాజ‌ధాని స‌నా పరిధిలో ఉ్న‌న చిన్న గ్రామం. ఇది భూ ఉప‌రిత‌లానికి 3200 మీట‌ర్ల ఎత్తులో కొండ‌పై ఉంది. మేఘాల‌పై చాలా ఎత్తులో ఆ గ్రామం ఉండ‌డం వ‌ల‌న అక్క‌డ వ‌ర్షం అనేది కుర‌వ‌ద‌ట‌. అంతేకాదు మేఘాల మీద ఉన్న‌ప్పుడు వ‌ర్షం ఎలా కురుస్తుంది.

ఈ గ్రామానికి ప‌ర్యాట‌క ప్రాంతంగా మంచి పేరు ఉంది. చాలా ఎత్తుగా ఉన్న ఈ గ్రామం నుండి చూస్తే మేఘాల నుండి వ‌ర్షం భూమిపై ప‌డే సుంద‌ర దృశ్యాల‌ను, ప్ర‌కృతిని ఆస్వాదించొచ్చు. ఈ గ్రామానికి సంద‌ర్శ‌కులు భారీగానే వ‌స్తుంటారు. ఉద‌యం ఎండ ఠారెత్తిపోతుంది. సాయంత్రం కాగానే చ‌లి వ‌ణికిస్తుంది. ఈ వాతావ‌ర‌ణం కొత్త వారికి చాలా వింతగా, విచిత్ర‌మైన అనుభూతిని క‌లిగిస్తుంది.

ప్రాచీన‌,ఆధునిక ప‌ద్ద‌తుల‌లో క‌ట్ట‌డాలు అక్క‌డ మ‌నం చూడొచ్చు. అల్ బోహ్రా లేదా అల్ ముఖ‌ర్మ తెగ‌ల‌కు చెందిన ప్ర‌జ‌లు ఇక్క‌డ ఎక్కువ‌గా నివ‌సిస్తుంటారు. వీరిని యెమెని క‌మ్యునిటీస్‌గా పిలుస్తుంటారు. ముంబైకి చెందిన మ‌హ‌మ్మ‌ద్ బుర్హానుద్దీన్ నేతృత్వంలోని ఇస్మాయిలీ విభాగం నుండి వ‌చ్చిన వారు అక్క‌డే స్థిర‌ప‌డ్డార‌ట‌. ఎంతో సుంద‌ర విశాల‌మైన ప్ర‌దేశంగా ఇది చూపరులని ఎంత‌గానో ఆకట్టుకుంటుంది.