BCCI : ఆ ముగ్గురి కెరీర్ అర్ధాంతరంగా ముగిసిన‌ట్టేనా.. మ‌ళ్లీ జ‌ట్టులోకి రావ‌డం చాలా క‌ష్ట‌మ‌ట‌..!

NQ Staff - March 18, 2022 / 02:59 PM IST

BCCI : ఆ ముగ్గురి కెరీర్ అర్ధాంతరంగా ముగిసిన‌ట్టేనా.. మ‌ళ్లీ జ‌ట్టులోకి రావ‌డం చాలా క‌ష్ట‌మ‌ట‌..!

BCCI : టీమిండియాలో అడుగుపెట్టేందుకు కొత్త కుర్రాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగ ప‌ర‌చ‌కుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ క్రికెట‌ర్స్ ప‌రిస్థితి అయోమ‌యంగా మారింది. కుర్రాళ్లు అద్భుత‌మైన ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న నేప‌థ్యంలో బీసీసీఐ సీనియ‌ర్స్‌పై వేటు వేసేందుకు కూడా వెన‌కాడ‌డం లేదు.

ఇప్పుడు టీమిండియాలో ముగ్గురు సీనియ‌ర్ ఆట‌గాళ్లు తిరిగి రావ‌డం అసాధ్యంగా క‌నిపిస్తుంది. అందులో మొదటి వ్యక్తి ఇషాంత్‌ శర్మ. సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చాలా కాలంగా విఫలమవుతున్నాడు. చివరిసారిగా నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో కనిపించాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక పోయాడు.

ఆగస్ట్ 2021లో ఇంగ్లాండ్ పర్యటనలో ఇషాంత్ శర్మ కెరీర్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అతను 3 టెస్ట్ మ్యాచ్‌లలో 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టు తర్వాత, ఇషాంత్ శర్మకు మళ్లీ టీమ్ ఇండియాలో ఆడే అవకాశం లభించలేదు. అతని బంతుల్లో ఇప్పుడు మ్యాజిక్ కనిపించడం లేదు. ఇషాంత్ 100కి పైగా టెస్టులు ఆడాడు. అందులో 311 వికెట్లు పడగొట్టాడు. అతని కెరీర్‌కు ముగినినట్లే కనిపిస్తోంది.

The BCCI does not even Hesitate to Hunt Down Seniors

The BCCI does not even Hesitate to Hunt Down Seniors

ఇక వృద్ధిమాన్ సాహా చాలా మంచి వికెట్ కీపర్. టెస్టు క్రికెట్‌లో అతనికి ఆడే అవకాశం లభించలేదు. 2010లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 40 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి అతడికి జట్టులో చోటు లభించడం లేదు. ఇప్పుడు ఈ ఆటగాడు మళ్లీ టెస్టు జట్టులోకి పునరాగమనం చేయగలడన్న ఆశ దాదాపుగా ముగిసింది.

సాహా టెస్ట్ కెరీర్ గురించి మాట్లాడితే.. అతను 40 టెస్టుల్లో 29.41 సగటుతో 1353 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు సాధించాడు. జట్టుకు దూరమైన ఆటగాళ్లు రంజీలు ఆడాలని, లేదంటే పునరాగమనం కష్టమని బీసీసీఐ చెప్పినా వృద్ధిమాన్ సాహా ఆడటం లేదు. ఇక అజింక్య రహానె చాలా ఘోరంగా పోరాడుతున్నాడు. అతని బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. క్రీజులో నిలవలేకపోతున్నాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అజింక్య రహానే కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ తర్వాతి మ్యాచ్‌లోనే తొలగించారు. అక్కడి నుంచి కెరీర్ పతనం మొదలై గత రెండేళ్లుగా టీమిండియా తరఫున సెంచరీ సాధించలేకపోయాడు. అందుకే శ్రీలంకతో జరిగే సిరీస్‌ నుంచే అతడిని జట్టు మేనేజ్‌మెంట్ తప్పించింది. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కి అవకాశం దక్కింది. శ్రేయాస్ ప్రతి సందర్భంలోనూ తానేంటో నిరూపించు కుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అజింక్యా రహానె టీమ్ ఇండియాలోకి పునరాగమనం అసాధ్యమనిపిస్తోంది. మ‌రోవైపు పుజారా కూడా ఇటీవ‌ల జ‌ట్టుకి ఇబ్బందిగా మారుతున్నాడు. అత‌ను ఫాం కొన‌సాగించ‌క‌పోతే అత‌నిపై కూడా వేటు త‌ప్ప‌దు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us