Viral Video: కాస్త లేట్ అయితే ఈ చిన్నారి పాము కాటుకు గుర‌య్యేవాడే- వీడియో

Viral Video: అదృష్టం ఉంటే ఎంత పెద్ద ప్ర‌మాదం జ‌రిగినా కూడా క్షేమంగా బ‌యట ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా పాముల విష‌యంలో ల‌క్ అనేది చాలా అవ‌స‌రం. బ‌య‌ట వెళుతున్న స‌మ‌యంలోనో లేదంటే ఇంట్లో ఉన్న స‌మ‌యంలోనో తెలియ‌క ఒక్కోసారి పాముపై కాలు వేస్తాం. అంతే అది మ‌న‌ల్ని క్షణాల‌లో కాటేస్తుంది. అదృష్టం బాగుంటే పాము పక్క నుండి క్షేమంగా వెళ్లిపోతాం. ఏదేమైన పామును చూస్తే పెద్దోళ్ల‌కే వ‌ణుకు వ‌స్తుంది.

Viral Video

ఇక చిన్న‌పిల్ల‌ల ప‌రిస్థితిఎలా ఉంటుంది చెప్పండి. కింగ్ కోబ్రా ఓ బుడ్డోడి వెనుక ప‌రుగులు తీయ‌గా,అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ స‌న్నివేశాన్ని చూస్తే ఎవ‌రికైన ఒళ్లు జ‌ల‌జ‌రించ‌డం ఖాయం. బుడ్డోడి మీద ప‌గబ‌ట్టిన‌ట్టే ఆ పాము ఉర‌కులు పెట్ట‌డం చూసి అంద‌రు షాక్ అవుతున్నారు .ఈ సంఘ‌ట‌న వియ‌త్నాంలో జ‌రిగింది.

వియ‌త్నాంలోని ఓ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఓ పిల్లాడు ఆడుకుంటూ ఉన్నాడు. పిల్లాడి తాత, తండ్రి అక్క‌డ వాళ్ల ప‌నుల‌లో ఉన్నారు. అయితే అంత‌లోనే నాగుపాము బుస‌లు కొడుతూ ఆడుకుంటున్న పిల్లాడి వ‌ద్ద‌కు వ‌చ్చింది. ముందుగా పాముని చూసిన తాత భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాడు. పిల్లాడిని తీసుకునేందుకు ప్ర‌య‌త్నం చేశాడు.. కానీ త‌న‌కు ఇటీవ‌లే స్ట్రోక్ రావ‌డంతో అంత‌గా స్పందించ‌లేక‌పోయాడు.

అప్ర‌మ‌త్త‌మైన తండ్రి.. ప‌రుగెత్తి బాలుడిని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు. నాగుపాము మాత్రం ఆ పిల్లాడి వెంట‌నే ప‌రుగెత్తింది.అయితే అప్ప‌టికే పిల్లాడి తండ్రి డోర్స్ క్లోజ్ చేయ‌డంతో లోప‌లికి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించిన పాము ఛాన్స్ లేక వెన‌క్కు వెళ్లిపోయింది. ఈ తతంగమంతా అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. ఈ వీడియో చూసిన ప్ర‌తి ఒక్క‌రు షాక్‌కి గుర‌వుతున్నారు.