Ravi Shastri: ర‌విశాస్త్రికి క‌రోనా పాజిటివ్‌.. టెన్ష‌న్ ప‌డుతున్న టీమిండియా

Ravi Shastri: ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న టీమిండియాకు క‌రోనా టెన్ష‌న్ తీర‌డం లేదు.ఇన్నాళ్లు ఆట‌గాళ్లు క‌రోనా బారిన ప‌డ‌గా, ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్రికి క‌రోనా పాజిటివ్ అతి తేలింది. ప్ర‌స్తుతం ర‌వితేజ ఇంగ్లండ్‌లో ఉన్నారు. ఆయ‌న‌కి కరోనా పాజిటివ్ అని తేల‌డంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతనితో పాటు మరో ముగ్గురిని కూడా ఐసోలేషన్‌లో ఉంచినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మెడికల్ టీమ్ ఆదివారం తెలిపింది.

<img class="alignnone size-full wp-image-68851" src="https://thenewsqube.com/wp-content/uploads/2021/08/more-ad.jpeg"

Ravi Shashtri Effected With Covid Positive

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. శనివారం వరకూ రవిశాస్త్రితో క్లోజ్‌గా ఉన్న కోచింగ్ స్టాఫ్‌లోని బౌలింగ్‌ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్‌ని బీసీసీఐ మెడికల్ టీమ్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచింది. అయితే బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌తో పాటు భారత క్రికెటర్లని టీమ్ హోటల్ నుంచి కెన్నింగ్టన్ ఓవల్ స్టేడియానికి మ్యాచ్‌ ఆడేందుకు ఈరోజు బీసీసీఐ మెడికల్ టీమ్ అనుమతించింది.

<img class="alignnone size-full wp-image-68851" src="https://thenewsqube.com/wp-content/uploads/2021/08/more-ad.jpeg"

బ‌యోబుబుల్ వాతావ‌ర‌ణంలో ఉన్న‌ప్ప‌టికీ ర‌విశాస్త్రికి క‌రోనా ఎలా సోకింద‌నే దానిపై క్లారిటీ రావ‌డం లేదు. వేరే వాళ్లెవ‌రితో వాళ్లు క‌లిసే అవ‌కాశం లేదు. . ఇరు జట్ల ఆటగాళ్లని కూడా వేర్వేరు హోటల్‌లో ఉంచి మరీ ఈసీబీ జాగ్రత్తలు తీసుకుంది. అయినప్పటికీ.. రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ రావడంతో.. ఈసీబీ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

<img class="alignnone size-full wp-image-68851" src="https://thenewsqube.com/wp-content/uploads/2021/08/more-ad.jpeg"

టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆట నాలుగో రోజుకు చేరింది. మూడోరోజు పూర్తి ఆధిపత్యం చూపిన టీమిండియా చివర్లో వెనువెంటనే వికెట్లు కోల్పోయినప్పటికి కోహ్లీ జాగ్ర‌త్త‌గా ఆడుతూ వ‌చ్చాడు. ఇప్పుడు అత‌ను ఔట్ కావ‌డంతో టీమిండియా క‌ష్టాల్లో ప‌డింది. నాలుగో రోజు ఆట ప్రారంభం అయిన కాసేపటికే టీమిండియా జడేజా రూపంలో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన జడేజా క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 215 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమిండియా.

<img class="alignnone size-full wp-image-68851" src="https://thenewsqube.com/wp-content/uploads/2021/08/more-ad.jpeg"