Dog: య‌జ‌మానిపై ప‌గ‌.. 4,105 కిలోమీటర్లు ప్ర‌యాణించి క‌రిచిన కుక్క‌

Dog: సాధార‌ణంగా ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు కుక్క‌ల‌ని పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు. ఎవ‌రింట్లో చూసిన కుక్క మ‌న‌కు ద‌ర్శ‌నం ఇస్తుంటుంది. కుక్క‌లు విశ్వాసానికి కేరాఫ్ అడ్రెస్‌గా భావిస్తుంటారు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు కూడా కుక్క‌ల‌ని త‌మ పెంపుడు కుక్క‌లుగా పెంచుకునేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే ఫిన్‌లాండ్‌కు చెందిన ఓ కుక్క మాత్రం వేల కిలోమీట‌ర్స్ ప్ర‌యాణించి చివ‌రికి ఓన‌ర్‌ని ప‌ట్టి క‌రిచింది. ఎప్పుడో జ‌రిగిన సంఘ‌ట‌న అయిన ఇప్ప‌టికీ ఇది వైర‌ల్ అవుతూనే ఉంది.

TheNewsQube-

dog

జూలై 18న ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చల్ చేసింది.మూడేళ్ల క్రితం జపాన్‌లో, రెండేళ్ల క్రితం మెక్సికోలో, పోయినేడాది ఉగాండాలో.. ఇలా ఏడాదికో ఊరి చొప్పున అదే టైటిల్‌తో వార్త వైరల్‌ అవుతూనే వస్తోంది. వివ‌రాలోకి వెళితే 1924లో ఓరేగావ్‌ సిల్వర్‌టన్‌కు చెందిన ఫ్రాంక్‌-ఎలిజబెత్‌ జంట తమ ఇద్దరు పిల్లలతో కలిసి.. ఇండియానా వోల్‌కట్ట్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు.

ఆ స‌మ‌యంలో వారి పెంపుడు కుక్క‌ని వీధి కుక్క‌లు త‌ర‌మ‌డంతో పారిపోయింది. అప్ప‌టి నుండి వారు వెతుకుతూనే ఉన్నారు. అయితే ఓ రోజు త‌మ పెంపుడు కుక్క ఒంటి నిండా మ‌ట్టితో, గాయాల‌తో సిల్వర్‌టన్‌లోకి యజమాని ఇంటికి తిరిగి వచ్చేసింది . మొత్తం 2,551 మైళ్లు(4,105 కిలోమీటర్లు) ప్రయాణించ‌గా, దానికి ఓ పెద్దావిడ కొన్నాళ్లపాటు ఆశ్ర‌యం ఇచ్చింది. ఈ విష‌యాన్ని బాగా ప‌రిశోధించి ప‌త్రిక‌లు పెద్ద క‌థ‌నాలు ఇచ్చాయి. ‘బాబీ ది వండర్‌ డాగ్‌’ పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. బాబీ అనే మూగ‌జీవి చేసిన సాహ‌సం ప్ర‌పంచ వ్యాప్తంగా మారుమ్రోగింది.

అయితే బాబీ స్టోరీకి వ్య‌తిరేఖంగా 2018లో దేర్‌ ఈజ్‌ న్యూస్‌ అనే వెబ్‌ సైట్‌ సెటైరిక్‌ స్టోరీ రాసింది. అందులో కుక్క తనను వదిలేసి వెళ్లిన ఓనర్‌ను వెతుక్కుంటూ వంద కిలోమీటర్లు ప్రయాణించిందని, కనబడగానే కరిచేసిందని రాసి ఉంది. ఈ సెటైరిక‌ల్ స్టోరీ కొన్నాళ్లుగా వైర‌ల్ అవుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ వ‌స్తుంది.