Mohammed Shami: మ‌హ్మ‌ద్ ష‌మీపై మాట‌ల తూటాలు.. స‌పోర్ట‌గా నిలిచిన పాక్ ఆటగాడు

Mohammed Shami: టీ20 వరల్డ్ కప్‏లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‎లో ఇండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భార‌త్ ఇంత దారుణంగా ఓడిపోవ‌డానికి కార‌ణం భారత ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమీ అని ప‌లువురు దుమ్మెత్తి పోస్తున్నారు. షమీ పాక్‌కు అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు.

Mohammed Shami

2015 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసినప్పుడు అతన్ని హీరోగా కీర్తించారు. 2019 వరల్డ్ కప్‎లో ఆప్ఘానిస్తాన్‎పై హ్యాట్రిక్ తీసినప్పుడు అతడిని ఆకాశనికెత్తారు. కానీ ఆదివారం జరిగిన మ్యాచ్‎లో భారత్ ఓడిపోవడంతో అతడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. షమీ పాకిస్థాన్‌ తరఫున ఆడాడని, అతడిని దేశద్రోహిగా అభివర్ణించాడని కొందరు అన్నారు.

అయితే ష‌మీకి భారీ ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. 2014 నుంచి 2021 వరకు షమీ పాకిస్తాన్‌తో 3 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ 4 వికెట్లు తీశాడని తెలిపాడు స‌చిన్. మహ్మద్ షమీ మేమంతా మీ వెంటే ఉన్నామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. టీమిండియాలో 11 మంది ప్లేయర్లు ఉండగా.. ఒక్క షమీని మాత్రమే ఓటమికి ఎందుకు బాధ్యుడ్ని చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక పాక్ స్టార్ బ్యాట్స్‌మెన్ రిజ్వాన్ కూడా ష‌మీకి స‌పోర్ట్‌గా నిలిచాడు. ఒక ఆటగాడు తన దేశం మరియు అతని ప్రజల కోసం ఎన్నో పోరాటాలు, ఒత్తిడి, త్యాగాలు అనుభ‌వించాల్సి ఉంటుంది. ఇవి అప‌రిమిత‌మైన‌వి. ష‌మీ ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ బౌల‌ర్స్‌లో ఒక‌రు. ద‌య చేసి వారిని గౌర‌వించండి. విభ‌జించి మాట్లాడ‌కండి అని అన్నాడు.