Pakistan : పాకిస్తాన్ లో మహిళలపై అఘాయిత్యాలు.. అక్కడి అధికారులు ఏం చేశారంటే..

NQ Staff - June 22, 2022 / 01:46 PM IST

Pakistan : పాకిస్తాన్ లో మహిళలపై అఘాయిత్యాలు.. అక్కడి అధికారులు ఏం చేశారంటే..

Pakistan : మహిళలపై అత్యాచారాలతో పాకిస్తాన్ లోని పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్సులో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజూ అక్కడ నాలుగైదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. దీన్ని నియంత్రించేందుకు ప్రావిన్సు అధికారులు.. ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయించారు.

Pakistan's Punjab To Declare "Emergency" Due To Rising Rape Cases

Pakistan’s Punjab To Declare “Emergency” Due To Rising Rape Cases


మహిళలపై అఘాయిత్యాలపై స్పందించిన పంజాబ్ హోం మంత్రి అత్తా తరార్ దీనిపై కేబినెట్ సబ్ కమిటీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని చెప్పారు. రోజూ నాలుగు నుంచి ఐదు రేప్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇలా ప్రావిన్సులోని మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల కేసులు గణనీయంగా పెరగడం ఆందోళనకర విషయమని చెప్పారు. ఈ పరిణామం ప్రభుత్వంతో పాటు సమాజానికి అత్యంత తీవ్రమైన అంశమని అన్నారు.

మరోవైపు ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు ఉన్న అవకాశాలపై పౌర సమాజం. మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు, సైనికాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

అత్యాచార వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టిందని చెప్పారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిని అరెస్టు చేస్తున్నామని అన్నారు. కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయడంలో కీలకమైన పంజాబ్ ప్రావిన్సు ఫోరెన్సిక్ సైన్స్ ఏజెన్సీని కూడా మరింత బలోపేతం చేయనున్నట్లు చెప్పారు.లైంగిక వేధింపుల విషయంపై స్కూల్స్ లోనూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో స్కూళ్లు, పాఠశాలల్లో డ్రగ్స్ తీసుకోవడం ఫ్యాషన్ గా మారిందని హోం మంత్రి అన్నారు. ఈ విషయంపై చింతిస్తున్నామని చెప్పారు.

భద్రత గురించిన ప్రాముఖ్యతను తల్లిదండ్రులు పిల్లలకు తెలియజేయాలని చెప్పారు. టీనేజ్ కి వచ్చిన పిల్లలను ఒంటరిగా వదలేయవద్దని .. వారిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని తల్లిదండ్రులకు పంజాబ్ ప్రావిన్స్ హోం మంత్రి అత్తా తరార్ సూచించారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us