America: అమెరికా ప్ర‌జ‌ల‌కు స‌రికొత్త టెన్ష‌న్.. వ‌ణికిస్తున్న ఉల్లిపాయ‌

America: ఒక‌వైపు ప్ర‌జ‌లంద‌రు క‌రోనాతో వ‌ణికిపోతుంటే మ‌రోవైపు విచిత్ర రోగాలు అంద‌రిలో గుబులు పుట్టిస్తున్నాయి. అమెరికాలో అయితే కొత్త రోగాలు మ‌రీ ఎక్కువ అయిపోతున్నాయి. ఉల్లి పేరు వింటేనే అమెరికా ఉలిక్కిప‌డుతోంది. ఉల్లిగ‌డ్డ‌ల ద్వారా వ్యాపిస్తున్న సాల్మోనెల్లా వ్యాధి అమెరికాను వ‌ణికిస్తోంది.

America

ఉల్లి వినియోగంతో తాజాగా 652 మందికి ఈ వ్యాధి సోక‌గా 129 మంది ద‌వాఖాన‌ల్లో చేరి చికిత్స పొందుతున్నార‌ని సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) గురువారం వెల్ల‌డించింది. మెక్సికో నుంచి దిగుమ‌తి చేసుకుని ప్రొసోర్స్ ఇంక్ పంపిణీ చేసిన ఈ ఉల్లిగ‌డ్డ‌ల‌ను ఇప్ప‌టివ‌ర‌కూ తిప్పిపంప‌క‌పోవ‌డంతో ఆందోళ‌న రేకెత్తుతోంది.

గత కొద్ది రోజులుగా అమెరికా, కెనడాలో సాల్మొనెల్లా(ఫుడ్‌ పాయిజన్‌ కలిగించే బ్యాక్టీరియా) మహమ్మారి కేసులు ఎక్కువగా వెలుగు చేస్తున్నాయని సీడీసీ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 34 రాష్ట్రాల్లో 400 మందికి ఈ బ్యాక్టీరియా సోకినట్లు అధికారులు వెల్లడించారు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రధానంగా పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుందని సీడీసీ తెలిపింది. ఫలితంగా అక్కడి వారికి డయేరియా (విరేచనాలు), జ్వరం, కడుపు నొప్పి వంటివి వస్తున్నాయి.

ఇది ఒక్కొక్కరిలో ఆరు గంటలపాటూ ఉంటుంది. బ్యాక్టీరియా సోకిన ఆరు గంటల తర్వాత ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరిలో ఆరు రోజుల తర్వాత కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయంటుని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. ఎరుపు, తెలుపు, గోధుమ రంగులో ఉండే ఈ ఉల్లి అంటేనే అమెరిక‌న్లు ఇప్పుడు గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు.

క‌రోనా వైర‌స్ కంటే ప్ర‌మాద‌క‌రంగా భావిస్తున్న‌ సాల్మోనెల్లా వ్యాప్తికి కార‌ణ‌మైన ఈ ఉల్లి ఇంకా అమెరిక‌న్ స్టోర్స్‌లో వినియోగంలో ఉంద‌నే వార్త‌లు ప్ర‌జ‌ల‌ను బెంబేలెత్తిస్తున్నాయి. స్టోరేజ్ కూల‌ర్ల‌లో ఈ ర‌క‌మైన ఉల్లి క‌నిపిస్తే వెంట‌నే పార‌వేయాల‌ని సీడీసీ ఆయా దుకాణాలు, రెస్టారెంట్ల‌ను కోరుతోంది. ఈ ర‌కాలైన ఉల్లిని క‌లిగిఉంటే ఆయా ఉప‌రిత‌లాల‌ను శుభ్రం చేసి శానిటైజ్ చేయాల‌ని సూచించింది.