ఆ ఒక్క ప‌నితో 47 మంది పిల్ల‌ల‌కు తండ్ర‌య్యాడా..!

సాధార‌ణంగా పెళ్లైన త‌ర్వాత తండ్రి కావాల‌నే కోరిక ప్ర‌తి మ‌గాడికి ఉంటుంది. అయితే అత‌డు ఒకరు లేదా ఇద్దరు మ‌హా అయితే ముగ్గురికి తండ్రిగా ప్ర‌మోష‌న్ పొందుతారు. కాని ఒక భ‌ర్త ఏకంగా 47 మంది పిల్ల‌ల‌కు తండ్రిగా మారాడ‌ట‌. విన‌డానికి కాస్త ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం! అయితే ఇది అలా జ‌రిగింది అంటే పూర్తి స్టోరీ చ‌దివితే కాని మీకు అర్ధం కాదు.

Men Became Father to 47 Children
Men Became Father to 47 Children

కొంద‌రు సంతానం కోసం తిర‌గ‌ని హాస్పిట‌ల్స్ ఉండ‌వు, చేయ‌ని పూజ‌లు ఉండ‌వు. ఎన్ని ర‌కాలు ప్ర‌య‌త్నించిన కూడా సంతానం ల‌భించదు. ఆ స‌మ‌యంలో వారు ప‌డే మ‌నో వేద‌న అంతా ఇంతా కాదు. అలాంటి ఆవేద‌న చెందుతున్న మ‌హిళ‌లకు సంతానం క‌లిగించేలా ముందుకు వ‌చ్చాడు. వీర్య దానం ద్వారా 47 మంది పిల్లలకు తండ్రయ్యాడు. అయితే, ఈ విషయాన్ని అతడి భార్య జీర్ణించుకోలేకపోతోంది.

త‌న భ‌ర్త తాను పిల్ల‌లు ఇంత వ‌ర‌కే ఉండాల‌ని ఏ మ‌హిళ అయిన భావిస్తుంది. కాని త‌న భ‌ర్త ఎవ‌రో బ‌య‌టి వ్య‌క్తుల‌కు తండ్రి అయ్యాడ‌ని తెలిస్తే ఏ భార్య జీర్ణించుకోలేదు. ఇప్పుడు ఓ మ‌హిళ త‌న సోష‌ల్ మీడియాలో తన భర్త 47 మంది పిల్లలకు తండ్రని, ఏం చేయాలో అర్థం కావడంలేదని అందులో పేర్కొంది. అయితే డైరెక్ట్‌గా అత‌ను సెక్స్‌లో పాల్గొన‌కుండా కేవ‌లం వీర్య దానం ద్వారా పిల్ల‌ల‌కు తండ్రైన ఆ విష‌యంపై గుర్రుగా ఉంది స‌ద‌రు మ‌హిళ‌.

భ‌విష్య‌త్‌లో త‌న భ‌ర్త‌కు పుట్టిన పిల్ల‌ల‌లో ఎవ‌రైన వ‌చ్చి ‘నువ్వే మా నాన్న’ అని ఇంటికి వస్తే పరిస్థితి ఏమిటని ఆమె వాపోతోంది. ఈ నేపథ్యంలో అతడితో కలిసి ఉండా? లేదా విడిపోవాలా? అనే విషయంపై స్నేహితులు, బంధువుల అభిప్రాయాన్ని కోరింది. పెళ్లై మాకు ఎనిమిదేళ్లు అవుతుంది. ఒక బిడ్డ ఉన్నారు. కొన్నేళ్లు డేటింగ్ చేశాం. పెళ్లి త‌ర్వాత అత‌ను వీర్య దాత అని తెలిసింది.

సాధార‌ణంగా ఒక‌రు లేదా ఇద్ద‌రికి వీర్యం దానం చేసి ఉంటాడని నేను భావించాను. గ‌తంలో అంద‌రికి వీర్యం ఇవ్వొద్ద‌ని కూడా హెచ్చ‌రించాను. కొద్ది రోజుల కిందట మాటల్లో భాగంగా మీరు ఎంతమందికి వీర్యదానం చేశారని అడిగాను. ఇందుకు అతడు 47 మందికని చెప్పాడు. అంతే, నాకు గుండె ఆగినంత పనైంది’’ అని తెలిపింది. పెళ్లికి ముందు ఈ విష‌యం తెలిసి ఉంటే ఇంత బాధ‌ప‌డి ఉండేవాడిని కాదు అని చెప్పుకొచ్చింది స‌ద‌రు మ‌హిళ‌.

నా భర్తకు విడాకులు ఇవ్వాలా? కలిసి ఉండాలా?’’ అని ప్రశ్నించింది ఆ మ‌హిళ‌. దీనిపై నెటిజ‌న్స్ అంత మంచి భ‌ర్త వ‌దులుకోవ‌ద్దని చూసించారు. అత‌ను నేరుగా సెక్స్ లో పాల్గొంటే త‌ప్పు.వీర్యం దానం చేశాడు. అంతే క‌దా. అయిన వీర్యదానం చేసినప్పుడే కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి వల్ల భవిష్యత్తులో దాతలకు ఆ పిల్లల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధైర్యంగా ఉండండి అంటూ ప‌లువురు స‌ల‌హాలు ఇస్తున్నారు.