Whisky: కోటి రూపాయ‌లు పెట్టి విస్కీ కొనుగోలు చేసిన వ్య‌క్తి ఎవరో తెలుసా?

Whisky: సాధార‌ణంగా వ‌స్తువుల పాత ప‌డితే వాటి రేటు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతాయ‌నే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. కాని మ‌ద్యం విష‌యంలో ఎంత పాత ప‌డితే అంత రేటు ప‌లుకుతూ ఉంటుంది. మ‌ద్యం ప్రియులు కూడా ఎక్కువ శాతం ఓల్డ్ లిక్క‌ర్‌కి ప్రియారిటీ ఇస్తుంటారు. దీని కోసం భారీగా కూడా ఖ‌ర్చు చేస్తుంటారు. తాజాగా ఓ వ్య‌క్తి విస్కీ బాటిల్ కోసం ఏకంగా కోటి రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టాడు. మ‌రి ఇంత ఖ‌ర్చు పెట్టిన ఈ విస్కీని అమృతంలా రోజు కొంచెం తాగొచ్చా అంటే అస్స‌లు తాగలేమ‌ట‌.

Man Buys 250 years old Whisky For one Crore Rupees
Man Buys 250 years old Whisky For one Crore Rupees

అమెరికా బోస్ట‌న్‌కు చెందిన హౌస్ స్కిన్నర్ ఇంక్ అనే కంపెనీ దాదాపు 250 ఏళ్ల క్రితం నాటి విస్కీ బాటిల్‌ని వేలం వేసింది. దీని ధర 20-40 వేల డాలర్ల మధ్య అమ్ముడవుతుందని భావించింది. కానీ అది అనూహ్యంగా అంతకు ఆరింతలు పలికింది. ఈ ఏడాది జూన్‌ 30న ముగిసిన వేలంలో ఈ బాటిల్‌ను మిడ్‌టౌన్ మాన్హాటన్‌లోని మ్యూజియం, పరిశోధనా సంస్థ ది మోర్గాన్ లైబ్రరీకి 1,37,500 డాలర్లకు (1,02,63,019 రూపాయలకు) విక్రయించారు.

ఈ విస్కీ బాటిల్‌ని ఇంగ్లెడ్యూ 1860లో ఫిల్ చేసింది. అనంత‌రం మోర్గాన్‌ లైబ్రరీకి అమ్మారు. ఆ కాలపు ప్రసిద్ధ ఫైనాన్షియర్ జాన్ పియర్ పాయింట్ మోర్గాన్‌ ఈ విస్కీ బాటిల్‌ను కొనుగోలు చేశారు. సీసా వెనుక భాగంలో ఉన్న లేబుల్‌ మీద ఇలా ఉంది ‘ఈ బౌర్బన్ బహుశా 1865 కి ముందే తయారు చేసి ఉండవచ్చు. మిస్టర్ జాన్ పియర్‌పాయింట్ మోర్గాన్ గదిలో ఈ బాటిల్ ఉండ‌గా, అత‌ని మ‌ర‌ణం త‌ర్వాత ఎస్టేట్ నుండి దీనిని స్వాధీనం చేసుకున్నారు.

నిపుణలు ప్రకారం జేపీ మోర్గాన్‌ ఈ బాటిల్‌ని 1900 లలో జార్జియా పర్యటనలో కొన్నారని నిపుణులు భావిస్తున్నారు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం బాటిల్ మోర్గాన్ కొడుక్కు చేరింది. అతను దానిని 1942 -1944 మధ్య దక్షిణ కెరొలిన గవర్నర్ జేమ్స్ బైర్నెస్‌కు ఇచ్చాడు. జేమ్స్‌ బైర్నెస్‌ ఆ బాటిల్‌ని తెరకుండా అలానే ఉంచాడు. 1955 లో పదవీవిరమణ చేసిన తరువాత బైర్నెస్ తెరవని బాటిల్‌ని స్నేహితుడు, ఆంగ్ల నావికాదళ అధికారి ఫ్రాన్సిస్ డ్రేక్‌కు పంపాడు.

ఆయ‌న బాటిల్ ని మూడు త‌రాల పాటు భ‌ద్రంగా ఉంచాడు. ఇలా బాటిల్ భ‌ద్రంగా ఉన్నప్ప‌టికీ, దీనిని తాగే అవ‌కాశం లేదు. అందుకు కార‌ణం ఇది త‌యార‌య్యి రెండు శ‌తాబ్ధాలు అయింది కాబ‌ట్టి. సాధారణంగా మూత తెరవకుండా ఉంటే విస్కీ పది సంవత్సరాల పాటు అలానే ఉంటుంది. అప్పుడు కూడా దాన్ని తాగలేం. గుర్తుగా మాత్ర‌మే దీనిని భ‌ద్రంగా దాచుకోగ‌లం