Italy: కోట్లు విలువ చేసే షాప్‌ని కేవ‌లం రూ.75కి అమ్మాడు..!

Italy: ఈ రోజుల్లో మ‌నం ఏదైన వ‌స్తువుని అమ్మ‌కానికి పెడుతున్నామంటే ఎంతో కొంత లాభం ఆశిస్తాం. మ‌నం పెట్టిన ఖ‌ర్చు క‌న్నా కొంత ఎక్కువ వ‌స్తే బాగుంటుంద‌ని చాలా మంది ఆశిస్తారు. కాని ఓ పెద్ద మనిషి కోట్లు విలువ చేసే సెలూన్‌ని త‌న షాపులో ప‌ని చేసే ఉద్యోగికి కేవ‌లం డాల‌ర్ (ఇండియన్‌ కరెన్సీలో రూ.74.91)కే అమ్మాడు.ఈ విష‌యం తెలిసి ప్ర‌తి ఒక్క‌రు నోరెళ్ల‌పెడుతున్నారు.

Italy

ఇట‌లీకి చెందిన పియ‌స్ 1965లో రోడ్ సైడ్ చిన్న బార్బ‌ర్ షాన్ నుండి ప్ర‌ముఖ హెయిర్ సెలూన్ దాకా ఎదిగారు. కుటుంబ పోష‌ణ కోసం ఎయిర్ సెలూన్ బిజినెస్ ర‌న్ చేస్తూ, ఖాళీ స‌మ‌యంలో త‌న‌కి ఇష్ట‌మైన సివిల్ కాంట్రాక్ట‌ర్‌గా పని చేస్తుండేవారు. ఆ స‌మ‌యంలో పియస్‌కు కాథీ మౌరా అనే స్కూల్‌ విద్యార్ధిని ‘అంకుల్‌ నాకు జాబ్‌’ కావాలని ఫోన్‌ చేసింది.

కాథీ మౌరా చిన్న‌ప్ప‌టి నుండే జాబ్ చేయాల‌ని భావించింది. ఆమె స్కూల్‌ విద్యార్ధి కావడం, పైగా అనుభవం లేదని చాలా మంది జాబ్‌ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఆ స‌మ‌యంలో త‌ను చ‌దివే స్కూల్ టీచ‌ర్ నాకు జాబ్ కావాల‌ని, ఎక్క‌డైన ఉంటే చెప్ప‌మ‌ని కాథీ అడిగింది. దీంతో సదరు టీచర్‌ పియస్‌ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చింది. ఆ తరువాత పియుస్‌ కు కాథీ ఫోన్‌ చేయడం, పియుస్‌కు చెందిన ఎయిర్‌ సెలూన్‌లో జాయిన్‌ అవ్వడం ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి.

italy

క‌ట్ చేస్తే ఇప్పుడు కోట్ల విలువ చేసే షాప్‌కి కాథీ ఓన‌ర్ అయింది. 15 ఏళ్ల నుండి కాథీ మౌరా ..పియస్ షాపులోనే న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా ఉంది. వ‌య‌స్సు రీత్యా షాపుని చూసుకోలేని ప‌రిస్థితులో పియుస్ ఉండ‌డంతో త‌న షాపుని కాథీకి కేవ‌లం ఒక్క డాల‌రుకే అమ్మాడు. ఇన్నేళ్లు అపురూపంగా చూసుకున్న తన సెలూన్‌ను కాథీ చేతిలో పెట్టాడు.

కాథీ చాలా మంచి అమ్మాయి. పైగా మంచి హెయిర్ స్టైలిష్ట్. 15ఏళ్లు నాతోనే పనిచేసింది. ఆమెకు కృతజ్ఞతగా హెయిర్‌ సెలూన్‌ ను అమ్మేశాను అంటూ పియుస్ చెప్పుకొచ్చాడు. అయితే ఒక్క డాల‌రుకి కాథీ ఈ షాపుని ద‌క్కించుకోద‌ల‌చుకోలేదు. ఆమె మంచి అమ్మాయి ఓన‌ర్ ప్ర‌శంస‌లు కురిపించాడు. ప్ర‌స్తుత ఈ ఇష్య్యూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.