ప్రేమికులకు స్థలం, ప్రాంతంతో సంబంధం లేదు. ఎప్పుడు, ఎక్కడైన ప్రేమించుకోవచ్చు, లవ్ ప్రపోజ్ చేయవచ్చు అని కొందరు విశ్వసిస్తుంటారు. ఇందులో భాగంగానే సిడ్నీలో భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ ఇండియన్ యువకుడు ఆస్ట్రేలియా యువతికి లవ్ ప్రపోజ్ చేశారు. ఆ సమయంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్ వెల్ కంటికి ఈ దృశ్యం చిక్కడంతో చప్పట్లు కొట్టి ప్రోత్సహించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
వివరాలలోకి వెళితే ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లకి గాను 389 పరుగులు చేసింది. ఇక 390 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్స్ పరుగులు రాబట్టేందుకు చాలా కృషి చేశారు. ఓ వైపు మ్యాచ్ టెన్షన్‌గా సాగుతున్న క్రమంలో ఇండియన్ యువకుడు ఒకరు.. ఆస్ట్రేలియా జెర్సీలో ఉన్న ఆ దేశ యువతికి ప్రపోజ్ చేశాడు. అది కూడా చాలా రొమాంటిక్‌గా . మోకాలిపై కూర్చొని యువతికి రింగ్ ఇచ్చి ఆ యువకుడు ప్రపోజ్ చేయగా, యువతి చాలా సంతోషంగా స్వీకరించింది. అనంతరం ఇద్దరు హత్తుకొని తమ ప్రేమని చాటుకున్నారు.
ఇద్దరి లవ్ ప్రపోజల్‌ని గమనించిన ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ నవ్వుతూ… చప్పట్లతో వారిని అభినందించాడు. క్రికెట్ గ్రౌండ్లో ప్రేమ ప్రపోజల్ అద్భుతం అంటూ నెటిజన్స్ దీనికి సంబంధించిన ఫొటోలని వీడియోని వైరల్ చేస్తున్నారు. కాగా, . వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆసీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్ నిరాశలో ఉంది. ఎలా అయిన టీ 20, టెస్ట్ సిరీస్ దక్కించుకోవాలనే కసితో ఉంది.
The sweetest moment of #INDvsAUS today….
pic.twitter.com/cLhAScTt06— Harsh Goenka (@hvgoenka) November 29, 2020