Vaccine: టీకా వేయించుకోవ‌ట్లేదా.. మీ ఉద్యోగం ఊడిన‌ట్లే..!

Vaccine: క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు త‌న ప్ర‌తాపం చూపిస్తుంది. వైర‌స్ సంక్ర‌మ‌ణ చెందుతుండ‌డంతో అంద‌రిలో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. ఇప్ప‌డు డెల్టా వేరియెంట్ త‌న ప్ర‌తాపం చూపిస్తుండ‌డంతో అంద‌రు వ‌ణికిపోతున్నారు. అంద‌రు క‌రోనా బారి నుండి కాస్త ఉప‌శ‌మ‌నం పొందాలి అంటే టీకా ఒక్క‌టే కాస్త ప‌రిష్కారంగా క‌నిపిస్తుంది. అయితే కొంద‌రు ఎంత చెబుతున్న‌ప్ప‌టికీ టీకాలు వేయించుకోవ‌డం లేదు.

Vaccine

ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వాలు తాయిలాలు ప్ర‌క‌టించ‌డంతో పాటు బెదిరింపుల‌కు కూడా దిగుతుంది. తాజాగా ఫిజీ టీకాలు తీసుకోక‌పోతే ఉద్యోగాలు ఉండ‌వు అని హెచ్చ‌రించింది. ప్ర‌భుత్వ ఉద్యోగులంతా ఆగ‌స్ట్ 15 నాటికి డోస్ వేసుకోక‌పోతే సెల‌వులో వెళ్లాల్సి ఉంటుంది. న‌వంబ‌ర్ ఒక‌టి క‌ల్లా రెండో డోస్ వేయించుకోక‌పోతే ఉద్యోగం నుండి తొల‌గిస్తాం. ప్రైవేటు ఉద్యోగ‌స్తులు ఆగ‌స్ట్ ఒక‌టి క‌ల్లా మొద‌టి డోసు వేయించుకోవాలి . లేదంటో భారీ జరిమానా ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది. సంస్థ‌లు మూసి వేసుకోవ‌ల‌సి వ‌స్తుంది.

టీకా తీసుకోక‌పోతే ఉద్యోగాలు ఉండ‌వు అంటూ ఫిజీ ప్ర‌ధాని ఫ్రాంక్ బైనిమారమా తీవ్ర‌మైన హెచ్చ‌రిక చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు సంక్ర‌మ‌ణ చెందుతుండ‌డంతో ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ వేయించుకోవ‌ల‌సి ఉంది. కాని కొంద‌రు దీనిని బేఖాత‌రు చేస్తున్న నేప‌థ్యంలో క‌ఠిన విధానాన్ని తీసుకొచ్చింది ఫిజీ ప్ర‌భుత్వం.

Vaccine

ఏప్రిల్ వ‌ర‌కు ఫిజిలో వైర‌స్ వ్యాప్తి లేద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. కాని ఇప్పుడు రోజుకు 700కు పైగా కేసులు వ‌స్తున్నాయి. ఇందుకు కార‌ణం డెల్లా వేరియెంట్‌. మ‌ళ్లీ కేసులు పెరుగుతూ పోతుండ‌డంతో వైద్యులు కూడా చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. మార్చురీలు నిండిపోవ‌డంతో మృత‌దేహాల‌ను తీసుకెళ్ల‌మ‌ని కుటుంబ స‌భ్యుల‌ని వేడుకోవ‌ల‌సి వ‌స్తుంది.

క‌రోనా నివార‌ణ‌కు లాక్ డౌన్ ప‌రిష్కారం అని చెబుతుండ‌గా, ప్ర‌ధాని దానిని తోసిపుచ్చారు. లాక్‌డౌన్ క‌రోనాను చంప‌ద‌ని నిపుణులు అంటున్నారు. లాక్‌డౌన్ పెడితే దేశ భ‌విష్య‌త్ దెబ్బ‌తింటుంద‌ని ఆయ‌న అన్నారు. దాదాపు9 ల‌క్ష‌ల మంది జ‌నాభా ఉన్న ఈ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,40,000 మంది మొద‌టి డోసు టీకా వేయించుకున్నారట‌