Dogs: రెచ్చిపోయిన కుక్క‌లు.. మ‌ర‌ణ‌శిక్ష విధించిన లాయ‌ర్

Dogs: కుక్క‌లన్నాక రెచ్చిపోవ‌డం స‌హజం. అవి రెచ్చిపోతే లాయర్ మ‌ర‌ణ శిక్ష విధించ‌డం ఏంటని అనుకున్నారా ? ఒళ్లు మండిన లాయ‌ర్ త‌న‌ను క‌రిచిన రెండు కుక్క‌ల‌కు మ‌ర‌ణ శిక్ష విధించి ప‌లువురి చేత చీవాట్లు తింటున్నాడు. పాకిస్తాన్‌లో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా, ఇది ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించింది. రెండు మూగ‌జీవాల‌ను క‌నీసం జాలి ద‌య లేకుండా చంపించేశాడు. ఈ సంఘ‌ట‌న జంతు ప్రేమికుల‌ని మ‌రింత‌గా క‌లిచి వేస్తుంది.

dogs

వివ‌రాల‌లోకి వెళితే పాక్ న‌గ‌రంలోని మీర్జా అక్త‌ర్ అనే లాయ‌ర్ ఉద‌యాన్నే మార్నింగ్ వాక్‌కు వెళుతుంటాడు. ప్ర‌తి రోజులానే ఆయ‌న రీసెంట్‌గా మార్నింగ్ వాక్‌కి వెళ్లాడు. అయితే.. జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన రెండు కుక్కలు ఆయన మీద పడి దారుణంగా కరిచాయి. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాయి. ఈ దాడికి సంబంధించిన ఘ‌ట‌న సీసీ టీవీలో రికార్డ్ కావ‌డంతో దాన్ని సాక్ష్యంగా ప‌ట్టుకొని కోర్టుకి తీసుకెళ్లాడు సీనియ‌ర్ లాయ‌ర్.

మనుషులను కరిచే కుక్కలను ఇళ్ల మధ్య ఉంచినందుకు యజమానిని ప్రతివాదిగా చేరుస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో.. ఇబ్బంది ఎదురవుతుందేమోనని భావించి కోర్టు బయట సెటిల్ మెంట్ చేసుకుందామని కోరాడు యజమాని. బ‌య‌ట‌కి వ‌చ్చాక ఇద్దరు క‌లిసి కొద్ది సేపు ముచ్చ‌టించారు. అయితే బాధితుడు పలు కండీషన్లు పెట్టగా, కుక్కల యజమాని అంగీకరించాడు.

ఒప్పందం ప్రకారం.. ఆ కుక్కలను ఎవరైనా వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయాలి. ఈ ఘటనపై క్షమాపణలు చెప్పాలి. ఇక భవిష్యత్ లో ఎన్నడూ ఇలాంటి ప్రమాదకరమైన కుక్కలను పెంచకూడదు అని లాయర్ షరతులు విదించాడు. వీట‌న్నింటికి కుక్క‌ల య‌జ‌మాని అంగీక‌రించి అనంత‌రం ఒప్పందంపై సంత‌కాలు చేసి కోర్ట‌కు స‌మ‌ర్పించారు. అయితే నోరు లేని మూగ జీవాల‌ని ఇలా చంప‌డం దారుణం అని జంతు ప్రేమికులు అంటున్నారు.