ఆ ప్రాంతంలో బూతులు మాట్లాడ‌డానికి వీల్లేదు..!

Samsthi 2210 - July 1, 2021 / 03:30 PM IST

ఆ ప్రాంతంలో బూతులు మాట్లాడ‌డానికి వీల్లేదు..!

ఈ రోజుల్లో చిన్న పిల్లాడి నుండి పండు ముస‌లి వ‌ర‌కు బూతులు కామ‌న్‌గా మాట్లాడుతున్నారు. ఏదో ఒక సంద‌ర్భంలో వారు బూతులు ఉప‌యోగించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. తెలుగు రాష్ట్రాల‌లో మాట్లాడుకునే బూతులు వింటే చెవులు మూసుకోవ‌ల్సిందే. అలా అని నార్త్ లో త‌క్కువ‌గా మాట్లాడతార‌ని కాదు. అక్క‌డ వారికి త‌గ్గ‌ట్టు బూతులు ఉంటాయి. అయితే ఓ ప్ర‌దేశానికి వెళితే బూతులు మాట్లాడ‌డానికి వీల్లేదట‌.

Utah State in USA

Utah State in USA

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన ‘యుటా’ ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. ఇక్కడ సాల్ట్ లేక్‌తో పాటు అర్చిస్ నేషనల్ పార్క్, కెన్యోన్లాండ్స్ నేషనల్ పార్క్, జియన్ నేషనల్ పార్క్ వంటి సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఉండగా, ఇక్క‌డికి నిత్యం ప‌ర్యాట‌కులు వ‌స్తూనే ఉంటారు. క‌రోనా వ‌ల‌న కొన్నాళ్ల పాటు టూరిస్ట్‌లు త‌గ్గ‌గా ఇప్పుడు మ‌ళ్లీ పూర్వ వైభవం సంత‌రించుకుంది.

యుటాలో ప్ర‌కృతి అందాలే కాక అక్క‌డి ప్ర‌జ‌లు, వారి అల‌వాట్లు ప‌ర్యాట‌కులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. అమెరిక‌న్లు చాలా మంది మంది ప్రియులే. కాని యుటాలోని చాలా గ్రామాల‌లో ఎవ‌రు మ‌ద్యం ముట్టుకోరు. క‌నీసం టీ, కాఫీలు కూడా తాగ‌రు. అమెరికాలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. యుటాలో మద్యం తాగేవారి సంఖ్య కేవలం 30 శాతమే.

ఇక మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే అక్క‌డ బూతులు మాట్లాడ‌డానికి అస్స‌లు వీల్లేదు. పాశ్చాత్యులు అతిగా వాడే ‘F*CK’ అనే బూతు వినిపిస్తే చాలు.. ‘‘మీరు అలా మాట్లడకూడదు. దయచేసి మర్యాదగా మాట్లాడండి’’ అని అక్కడి ప్రజలు హితవు పలుకుతారు. ఒక్క‌సారి యుటాకి వెళితే అంద‌రు మర్యాద రామ‌న్న‌లా మారిపోతార‌ట‌. వీరు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం నిత్యం శ్ర‌మిస్తుంటారు.

యుటా ప్ర‌జల‌కు సేవా ధృక్ప‌థం కూడా ఎక్కువే. వారు సంపాదించే మొత్తంలో ఎక్కువ శాతం సేవా కార్య‌క్ర‌మాల కోసం ఖ‌ర్చుచేస్తారు. ఇక్క‌డ విద్యావంతులే అధికం. యుటా జనాభాలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ. ఇక్కడ స్త్రీలు కంటే పురుషులే ఎక్కువ నివసిస్తుంటారు. జనాభాలో 60 శాతం మగాళ్లే ఉంటారు. ఈ క్ర‌మంలో అక్క‌డ ఎక్కువ మంది పెళ్లి కాని ప్ర‌సాద్‌లే క‌నిపిస్తుంటారు. అమెరికాలో డేటింగ్ సైట్స్, పోర్న్ వెబ్‌సైట్లలో అత్యధిక రిజిస్ట్రేషన్లు కలిగిన రాష్ట్రం కూడా ఇదే కావడం గమనార్హం.

Read Today's Latest International in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us