Bill Gates: చెరో 5 లక్షల 64 వేల కోట్లు పంచుకుంటూ విడాకులు తీసుకున్న బిల్ గేట్స్ దంపతులు

Bill Gates: సెలెబ్రిటీలు పెళ్ళిళ్ళు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇలాంటి విషయాలు చాలా కామన్ గా మారారు. అయితే ఈ మధ్య కాలంలో బిల్ గేట్స్, మెలిండా గేట్స్ వారి వైవాహిక జీవితానికి పబ్లిక్ గా బ్రేక్ అప్ చెప్పుకున్నారు. అయితే మెలిండా అప్లై చేసుకున్న విడాకులకు జడ్జి ఆమోదం తెలిపారు. దీంతో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఇప్పుడు అఫిషియల్ గా సింగిల్ అయ్యారు.

Bill Gates

అయితే వారిద్దరూ విడిపోతున్నామనే విషయం మే నెలలో అధికారికంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 1987 లో మైక్రోసాఫ్ట్ సంస్థను స్టార్ట్ చేసినప్పుడు వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత 1994లో వాళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. కేవలం విడిపోయే విధంగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు డైవర్స్ ఇవ్వడం జరిగింది.

ఎవరికి ఎవరూ భరణం ఇచ్చే రీతిలో ఒప్పందం జరగలేదని కోర్ట్ డాక్యుమెంట్స్ ద్వారా స్పష్టం అవుతుంది. విడాకుల ఆమోద పత్రంలో ఆర్థిక అంశాల గురించ ఎలాంటి ప్రస్తావన లేదు. లేటెస్ట్ సమాచారం ప్రకారం బిల్ గేట్స్ ఆస్తి దాదాపు 152 బిలియన్ల డాలర్లు. అయితే ఈ ఆస్తి గేట్స్ దంపతులకు సమానంగా పంచాల్సి వస్తే అప్పుడు ఒక్కొక్కరికి 76 బిలియన్ల డాలర్లు ఉంటుందని అంచనా.

ఇక 50 బిలియన్ డాలర్ల గేట్స్ ఫౌండేషన్ ను గేట్స్ భార్యభర్తలిద్దరూ కలిసి మరో రెండేళ్ళ పాటు నడపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫౌండేషన్ ను 2000 లో స్థాపించారు. ప్రజారోగ్యం, విద్య, వాతావరణ మార్పులపై ఈ ఫౌండేషన్ దృష్టి సారించింది.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్చంద సంస్థల్లో ఒకటి కావడం విశేషంగా చెప్పొచ్చు. మెలిండా ఫ్రెంచ్ గేట్స్ విడాకుల కోసం వాషింగ్టన్ కౌంటీ కోర్టులో అప్లయ్ చేసుకున్నారు. అలాగే బిల్ గేట్స్ వయస్సు 65 ఏళ్ళు కాగా మెలిండా వయస్సు 56 సంవత్సరాలు. ఇక వీరిద్దరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.