Chicago: స్కూల్లో విద్యార్ధుల‌కు కండోమ్స్ పంపిణీ.. మండిప‌డితున్న పేరెంట్స్

Chicago: ఈ కాలం నాటి పిల్ల‌ల‌కు స‌మాజంలోని చాలా విష‌యాల‌పై అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది. మూడు, నాలుగు త‌ర‌గ‌తి నుండి వారికి సెక్స్ అంటే ఏంటో తెలిసిపోతుంది. అయితే పాఠ‌శాల విద్యాభోధ‌న‌లో సెక్స్ గురించి కూడా ప్ర‌త్యేకంగా భోదిస్తే మేల‌ని నిపుణులు అంటున్నారు. ఏదైన మితంగా ఉంటే ప‌ర్లేదు కాని అవ‌ధులు దాటితేనే అస‌లు సమ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతాయి. ఇప్పుడు అమెరికాలోని చికాగో ఎడ్యుకేషన్‌ బోర్డు కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటుంది.

Chicago

సెక్స్ ఎడ్యుకేష‌న్ కోసం అని ఐదో త‌ర‌గ‌తి ఆపై విద్యార్ధుల‌కు పాఠ‌శాల‌లో కండోమ్స్ పంపిణీ చేయాల‌ని చికాగో ఎడ్యుకేష‌న్ బోర్ట్ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఆదేశాలు కూడా జారీ చేశార‌ట‌. ఇలాంటి వాటిని అప్పుడే ఎందుకు ఎంక‌రేజ్ చేస్తున్నార‌ని తల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అస‌లు విష‌యం ఏంటంటే చికాగో పబ్లిక్ స్కూల్స్‌ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గతేడాది డిసెంబర్‌లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ రూపొందించింది.ఇందులో భాగంగా విద్యార్ధుల‌కు ఆరోగ్యకర సంబంధాలు-సమ్మతి, శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం’ తదితర అంశాలను విద్యార్థులకు బోధించనున్నారు.

దీనిపై స‌మ‌స్య ఉంటే త‌ల్లిదండ్రులు లిఖిత పూర్వంగా యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే సెక్స్ ఎడ్యుకేష‌న‌ల్ పాల‌సీ ప్ర‌కారం ఎలిమెంటరీ స్కూళ్లలో 250 వరకు, హైస్కూళ్లలో ఒక వెయ్యి వరకు కండోమ్స్‌ను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఇవి పూర్తిగా ఉచితం.బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు కండోమ్స్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కండోమ్స్‌ అయిపోతే ప్రిన్సిపాల్స్‌ సదరు ఉన్నతాధికారులకు తెలియజేసి.. తెప్పించుకోవాలని తెలిపింది.

సెక్స్ ఎడ్యుకేష‌న్ పేరుతో కండోమ్స్ అందుబాటులో ఉంచాల‌ని తెచ్చిన పాల‌సీని త‌ల్లిదండ్రులు తీవ్రంగా వ్య‌తిరేఖిస్తున్నారు. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌లు అంటే వారు ఇంకా చిన్న పిల్ల‌లే. వారికి కండోమ్స్ ఇవ్వ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై మ‌రోసారి ఆలోచ‌న చేయాల‌ని చెబుతున్నారు. అయితే వైద్యులు, మానసిక విశ్లేషకులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య రీత్యా ఈ పాలసీ చాలా అవసరమని.. విద్యార్థులకు కండోమ్స్ అందుబాటులో ఉంచకపోతే, వాటిపై అవ‌గాహ‌న క‌ల్పించ‌క‌పోతే చెడు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.