Couple: బ‌ట్ట‌లు లేకుండా ఉండే ఈ భార్య,భర్త‌ల గురించి మీకు తెలుసా?

Samsthi 2210 - August 16, 2021 / 04:56 PM IST

Couple: బ‌ట్ట‌లు లేకుండా ఉండే ఈ భార్య,భర్త‌ల గురించి మీకు తెలుసా?

Couple: భార‌తీయ సంప్ర‌దాయం ప్ర‌కారం మ‌హిళ‌లు లేదా పురుషులు వ‌స్త్రాలు వేసుకొని ఉంటారు. మ‌న క‌ట్టుబాట్ల ప్ర‌కారం స‌మాజంలో తిరిగే ప్ర‌తి ఒక్క‌రు దుస్తులు ధ‌రించాల్సిందే. నచ్చినా .. నచ్చకపోయినా సమాజంలో మనం కూడా భాగమే కాబట్టి తప్పక పాటించాలి. ముఖ్యంగా బట్టలు వేసుకోవడం విషయంలో మాత్రం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కట్టుబాటు ఉంది. కొంద‌రు స‌గం దుస్తులు ధ‌రిస్తే మ‌రి కొంద‌రు ఫుల్‌గా వ‌స్త్రాలు ధ‌రించి ఉంటారు.

Couple in England Lives Without Clothes

Couple in England Lives Without Clothes

ఓ జంట మాత్రం మాకు బ‌ట్ట‌లు అవ‌స‌రం లేదంటూ న‌గ్నంగా తిరుగుతున్నారు. ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలో పాత వాహనంలో ప్రకృతి మధ్య జీవనం సాగిస్తున్నారు. వీరు నగరంలోకి వెళ్లాల్సి వచ్చినా బట్టలు వేసుకోరు. నగ్నంగానే వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుని వచ్చేస్తారు. ఇంగ్లండ్ లోని చిప్పెన్హామ్ ప్రాంతానికి చెందిన ప్రకృతి ప్రేమికులు జాన్ హెలెన్ దంపతుల జీవన విధానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

2011లో జాన్ హెల‌న్ పురాత‌న ప‌ద్ధతిలో వివాహం చేసుకున్నారు. 2006 నుంచి నేచరిస్ట్గా జీవనం సాగిస్తున్న హెలెన్ను ఇష్టపడిన జాన్.. 2011 నుంచి తను కూడా అలా మారిపోయారు. వీరిద్ద‌రు 24 గంట‌లు బ‌ట్ట‌లు లేకుండానే ఉంటార‌ట‌. విద్యుత్ వాడరు. ప్ర‌కృతిలో ల‌భించే నీటిని త‌ప్ప కుళాయిల ద్వారా వ‌చ్చే నీటిని అస్స‌లు వాడ‌రు. జీవితం మొత్తం పూర్తిగా ప్ర‌కృతితో మమేకం అయి ఉంటుంది.

న‌గ‌రంలోకి వెళ్లిన‌ప్పుడు కూడా న‌గ్నంగా వెళ‌తార‌ట‌. మాది ఓ ప్రత్యేకమైన జీవన విధానం. అందరూ అనుసరించదగినది కాదు. ఇలా జీవించమని మేము ఎవరినీ బలవంతం కూడా చేయము. మాకు ఇలా బతకాలని అనిపించింది. మేం న్యూడిస్ట్లం కాదు.. నేచురలిస్ట్లం. రెండు తువ్వాళ్లు తప్ప మా దగ్గరం ఇంకెలాంటి దుస్తులూ ఉండవు. విద్యుత్తును వాడం. మేం అటవీ ప్రాంతంలో నివసిస్తున్నాం కాబట్టి.. జంతువులు కీటకాల నుంచి ప్రమాదం లేకుండా ఉండడం కోసం వ్యాన్లో ఉంటున్నామని హెలెన్ తెలిపారు.

Read Today's Latest Trending in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us