Athletes: క్రీడాకారుల కోసం కండోమ్స్ గిఫ్ట్.. వాటినే మెడ‌ల్స్ అనుకోమ‌ని స‌ల‌హా

Athletes: కొన్ని సంఘ‌ట‌న‌లు వింటుంటే మ‌న‌కు ఔరా అనిపించ‌డం ఖాయం. ఇప్పుడు మీరు చ‌దివే వార్త కూడా అలానే అనిపిస్తుంది. 1988 సియోల్ ఒలంపిక్స్‌లో తొలి సారిగా అథ్లెట్లకు కండోమ్స్ పంపిణీ చేశారు. ఒక్కొక్క‌రికి 14 చొప్పున దాదాపు 1 లక్షా 60 వేల కండోమ్స్ సిద్దం చేశార‌ట నిర్వాహ‌కులు. అప్ప‌ట్లో ఎయిడ్స్ మ‌హ‌మ్మారి విస్తృతంగా వ్యాపిస్తుండ‌టంతో టోక్యో ఒలంపిక్స్‌కు వ‌చ్చే క్రీడాకారుల‌కు ఇలా కండోమ్స్ ఇచ్చార‌ట‌. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతీ ఒలింపిక్స్‌లో అథ్లెట్లకు ఉచితంగా కండోమ్స్ పంపిణీ చేయడం ఆనవాయితీగా మారింది. ఐదేళ్ల క్రితం జరిగిన రియో ఒలింపిక్స్‌లో 4,50,000 కండోమ్స్ పంచిపెట్టారు. అప్పుడు మ‌నిషికి 42 కండోమ్స్ చొప్పున ఇచ్చార‌ట‌. 2000 సంవ‌త్స‌రంలో జ‌రిగిన సిడ్నీ ఒలంపిక్స్ స‌మ‌యంలోను పంచి పెట్టార‌ట‌.

Athletes

 

ఒలంపిక్స్ కోసం 200కి పైగా దేశాల నుండి అథ్లెట్స్ వ‌స్తారు. వీరంద‌రు ఒకే చోట బ‌స చేస్తారు. ఇందులో 70 శాతం మంది అథ్లెట్స్ త‌ప్పక సెక్స్ చేస్తార‌ట‌. అమెరికాకు చెందిన స్విమ్మర్ ర్యాన్ లోచే ఒలింపిక్స్ విలేజ్ గురించి అనేక ఆశ్చర్యకరమైన సంగతులు తెలిపారు. ఒలంపిక్ క్రీడా గ్రామంలో ఉండే 75 శాతం మంది అథ్లెట్స్ త‌ప్ప‌క సెక్స్ చేసుకుంటారు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వారు దొర్లుకుంటూ క‌నిపిస్తారు. నా తోటి అమెరికన్ బీరక్స్ గ్రీర్ అయితే రోజుకు ముగ్గురు మహిళా అథ్లెట్లతో సెక్స్ చేయడం అలవాటు. 2000 సిడ్నీ గేమ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన బీర‌క్స్ ఇలా సెక్స్ లో పాల్గొని మోకాలి గాయంతో త్రోలో పాల్గొనలేదు . అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి హోప్ సోలో అయితే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో తాము గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత ఒక సెలెబ్రిటీతో తన గదిలోనే సెక్స్ చేసినట్లు ఒప్పుకున్నది.

Athletes

టోక్యో ఒలంపిక్స్‌లో ఐవోసీ లక్షా 60 వేల కండోమ్స్ పంపిణీ చేయడంతో పాటు ‘ప్లే బుక్’ రిలీజ్ చేసింది. అథ్లెట్స్ మైదానంలో కాని, క్రీడా గ్రామంలో కాని త‌ప్ప‌క సోష‌ల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల‌ని పేర్కొంది. కౌగిలించుకోవడం, కరచాలనం చేయడంపై నిషేధం విధించారు. అయితే కండోమ్స్‌ని ఉచితంగా పంచ‌డంపై అథ్లెట్స్ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించ‌గా, దానిపై స‌మాధానం ఇచ్చిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎయిడ్స్ పై అవ‌గాహ‌న కోసం ఇలా చేస్తున్నాం. పతకాలు గెలవని వాళ్లు వాటినే ఒలింపిక్స్ మెడల్స్‌గా భావించి తమ దేశాలకు తిరిగి తీసుకొని వెళ్లండి. అక్కడి మీ ప్రజలకు కూడా అవగాహన కల్పించండి అని చెప్పుకొచ్చింది.

Athletes