ఇండియా వర్సెస్ ఆసీస్: చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్న భారత స్టార్ స్పిన్నర్
Samsthi 2210 - November 27, 2020 / 07:03 PM IST

కరోనా వలన దాదాపు ఎనిమిది నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న క్రికెటర్స్ ఇప్పుడిప్పుడే గ్రౌండ్స్‌లో అడుగుపెడుతున్నారు. రెండు నెలల పాటు ఐపీఎల్‌తో సందడి చేసిన క్రికెటర్స్ ఇప్పుడు టోర్నమెంట్స్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుండి జనవరి వరకు భారత్ ఆస్ట్రేలియా టూర్‌తో బిజీగా ఉండనుంది. బయో బబుల్ వాతావరణంలోనే ఈ టోర్నీ జరగనుండగా, కేవలం 50 శాతం వీక్షకులని మాత్రమే గ్రౌండ్‌లోకి అనుమతిస్తారు. ఈ రోజు జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా,నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది.
భారత్ 376 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా, బ్యాట్స్ మెన్ సరైన ప్రదర్శన కనబరచకపోవడంతో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓడింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్‌లో ఫించ్(112), వార్నర్(62), స్టీవ్ స్మిత్(105) పరుగులు చేశారు. వీరితో పాటు మ్యాక్స్ వెల్ కూడా మెరుపులు మెరిపించాడు. అయితే భారత బౌలర్లలలో స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ని టార్గెట్ చేయడంతో ఈ బౌలర్ పది ఓవర్లలో ఒకే వికెట్ తీసి 89 రన్స్ సమర్పించుకున్నాడు. వన్డేల్లో ఈ స్థాయిలో రన్స్ ఇవ్వడం చాహల్‌కు ఇదే తొలిసారి
గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో చాహల్ 88 పరుగులు ఇచ్చాడు. ఇదే చాహల్‌కు చెత్త రికార్డ్ కాగా, దానిని మరోసారి తనపైనే రాసుకున్నాడు . వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న భారత స్పిన్నర్ల జాబితాలో పియూష్ చావ్లా మూడో స్థానంలో ఉన్నాడు. 2008లో మిర్పూర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చావ్లా 85 రన్స్ ఇచ్చుకున్నాడు. ఈ రోజు జరిగిన వన్డే మ్యాచ్‌లో మిగతా బౌలర్స్ విషయానికి వస్తే .. రవీంద్ర జడేజా వికెట్లేమీ తీయకుండా పది ఓవర్లలో 63 రన్స్ ఇచ్చుకున్నాడు. నవదీప్ సైనీ 89 పరుగులు ఇవ్వగా.. బుమ్రా 73 రన్స్ , షమీ 59 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు.