Egg: మనిషి మలంతో పాటు దొరికిన గుడ్డు వెయ్యేళ్ళ నాటిది.. ఆశ్చర్యంలో పురావస్తుశాఖ

Egg: అప్పుడప్పుడు పురావస్తు తవ్వకాల్లో ఎన్నో పాత వస్తువులు బయటపడుతుంటాయి. అలా రీసెంట్ గా ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ చేపట్టిన తవ్వకాల్లో ఓ అరుదైన గుడ్డు దొరికింది. మనుషుల మలంతో నిండిన సెస్పిట్ లో దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి గుడ్డును కనిపెట్టారు. సాధారణంగా గుడ్డును ఫ్రిడ్జ్ లో పెడితే ఓ ఐదు వారాల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది.

egg

అదే బయట ఉంటే రెండు వారాల్లో పాడైపోతుంది. మంచు ప్రదేశాల్లో అయితే ఓ ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత ఏ గుడ్డు అయినా సరే కుళ్ళిపోతుంది. అయితే ఇజ్రాయెల్ లో ఓ ఆర్కియాలజిస్టుకు వెయ్యేళ్ళ క్రిందట కోడి గుడ్డు దొరికింది. అయితే ఈ గుడ్డును మనుషుల మలంతో నింపే గొయ్యిలో ఇది లభించింది. ఓ కథనం ప్రకారం యావ్నేలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ చేపట్టిన పురాతన తవ్వకాల్లో ఈ గుడ్డు కనిపించింది.

ముందు ఈ తవ్వకాల్లో బైజాంటైన్ కాలం నాటి సెస్పిట్ కనిపించింది. ఇందులో మనుషులు మలంతో నిండిన దాంట్లో అప్పటి కోడి గుడ్డును వెలికి తీసారు. అయితే 1000 సంవత్సరాల క్రిందట ఈ గుడ్డును కావాలనే ఈ సెస్పిట్ లో నిల్వ ఉంచారని ఆర్కియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. నిజానికి ఈ గుడ్డు వెయ్యేళ్ళు ఎలా నిల్వ ఉందనే విషయంపై ఇప్పుడు పరిశోధనలు చేస్తారని అంటున్నారు.

అలాగే ఈ గుడ్డును పలుచని మలంలో ఉంచడం వల్లే అన్ని సంవత్సరాలు చెక్కు చెదర్లేదని అంటున్నారు. అలాగే ఈ గుడ్డు పెంకు కూడా చాలా బలంగా ఉందట. గుడ్డ మీద చిన్నగా బీటలు ఏర్పడటం వల్ల గుడ్డులోని తెల్లసొన లీక్ అయ్యిందని, లోపలి పసుపు సొన మాత్రం అలాగే ఉందని తెలిపారు.

అయితే దీనిని డీఎన్ఏ అనాలసిస్ కోసం ల్యాబ్ కు పంపనున్నట్లు తెలుస్తుంది. ఈ గోతిలో ఎముకలతో తయారు చేసిన బొమ్మలున్నాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నట్లుగా మరో ఆర్కియాలజిస్ట్ పేర్కోన్నారు. ఏది ఏమైనా మనిషి మలంలో ఓ గుడ్డు ఇన్ని సంవత్సరాలు ఎలా ఉందనే దానిపై ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.