America: విమానంలో మ‌హిళ‌ను సీటుకు క‌ట్టేసిన సిబ్బంది.. అస‌లేం జరిగింది?

America: భూమికి కొన్ని వంద‌ల అడుగుల ఎత్తులో ప్ర‌యాణించే విమానంలో కొన్ని విచిత్ర సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయితే కాని అధికారుల దృష్టికి వెళ్ల‌వు. ఒక్కోసారి అధికారుల దృష్టికి అవి వెళ్లినా కూడా వాటిని ప‌ట్టించుకునే వాళ్లే ఉండ‌రు. తాజాగా ఓ విమానంలో జ‌రిగిన సంఘ‌ట‌న అంద‌రిని నోరెళ్ల‌పెట్టేలా చేసింది. విమాన సిబ్బంది ఓ మహిళను టేపుతో సీటుకు కట్టేశారు. ఆమెని ఎందుకు అలా క‌ట్టేశార‌నే క‌దా మీ డౌట్‌! ఈ స్టోరీ చ‌ద‌వండి.

America

టెక్సాస్ నుంచి నార్త్ కరోలినాకు బయల్దేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ పిచ్చెక్కిన‌ట్టు ప్ర‌వ‌ర్తించింది. విమానం ప‌లు కార‌ణాల వ‌ల‌న గంట ఆల‌స్యంగా బ‌య‌లుదేరింది. అయితే టేకాఫ్ అయ్యాక మ‌హిళ త‌న‌ను కింద‌కు దించాలంటూ కేక‌లు పెట్టింది. సిబ్బంది ఈ స‌మ‌యంలో కుదర‌దు అని చెప్పినా కూడా మ‌హిళ ఏ మాత్రం వినిపించుకోలేదు.

గ‌ట్టిగ‌ట్టిగా అరుస్తూ, మ‌తిస్థిమితం కోల్పోయిన‌ట్టుగా మ‌హిళ మాట్లాడ‌డం మొద‌లు పెట్టింది. గంట సేపు వీరంగం సృష్టించిన ఈ మహిళ తోటి ప్ర‌యాణికులు చెప్పినా కూడా విన‌లేదు. ఒకానొక సంద‌ర్భంలో విమానం డోరు తెరిచేందుకు కూడా ప్ర‌య‌త్నించింది. అప్ప‌టికే విమానం కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉంది. దీంతో అందరు హ‌డ‌లిపోయారు ఇక చేసేదేం లేక మ‌హిళ‌ను సీట్లో కూర్చోబెట్టి డక్ట్-టేపుతో కట్టేశారు.

విమానం గమ్యానికి చేరిన తర్వాత భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తి ఈ త‌తంగాన్ని వీడియో తీసి టిక్ టాక్‌లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజన్స్ మిశ్ర‌మ స్పంద‌న తెలియ‌జేస్తున్నారు. మ‌హిళ‌తో అలా ప్ర‌వ‌ర్తించ‌కుండా ఉండ‌ల్సింది అని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు ఇలాంటి వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు.

కొద్ది రోజుల క్రితం రష్యా విమానంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ మహిళ తన అండర్‌వేర్‌ విప్పేందుకు ప్రయత్నించింది. దీంతో సిబ్బంది ఆమెను తాళ్లు, టేపుతో చైర్‌కు కట్టేశారు. ఈ ఇష్యూ కూడా పెద్ద చ‌ర్చనీయాంశంగా మారింది.